ఖమ్మం

ఘనంగా తల్లిపాల వారోత్సవాల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలపల్లి, ఆగస్టు 2: మండల పరిధిలోని మంగపేట అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మంగపేట నుండి ములకలపల్లి బస్టాండ్‌సెంటర్ వరకు కొనసాగింది. ములకలపల్లి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగేంద్రమ్మ మాట్లాడుతూ గర్భవతులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తద్వారా పుట్టేబిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు గరికె సుజాత, నాగరాణి, సిహెచ్ బుచ్చమ్మ, రమా, నీల, పాపారాణి, ఆయా నర్సమ్మ, పాఠశాల హెచ్‌ఎం వీర తదితరులు ఉన్నారు.