ఖమ్మం

కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, ఆగస్టు 2: కార్మికుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని సిఐటియు పాలేరు కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం నేలకొండపల్లి గ్రామంలో సిఐటియు మండల మహాసభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌రావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం బిల్డింగ్ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాడాలన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు దక్కుతాయన్నారు. కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గంధం వెంకటేశ్వర్లు, ఖాజా, నాగేశ్వరరావు, గంధవరపు రామారావు, పుల్లయ్య పాల్గొన్నారు.