ఖమ్మం

ప్రజాఉద్యమాలపై కెసిఆర్ ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 2: ప్రజాఉద్యమాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని, పోడు-కూడు కోసం ఎన్ని నిర్బంధాలనైనా ఎదుర్కొంటామని సిపిఎం రాష్టన్రేత కాసాని ఐలయ్య అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పోడు సాగుదారులను అక్రమంగా అరెస్ట్‌లు చేస్తూ నిర్బంధాలకు గురి చేస్తున్నారని నిరసిస్తూ మంగళవారం భారీ ప్రదర్శనను నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జాటోత్ కృష్ణ, వాంకుడోత్ కోబల్, నర్సింగ్‌లను పోడుసాగుదారులకు అండగా ఉన్నారనే నెపంతో అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. వందలాది ఎకరాలు మొక్కలునాటడం పేరుతో ఫారెస్ట్ అధికారులు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతుల వద్ద నుండి భూములు తీసుకొనిమరీ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వేల ఎకరాలను ఆక్రమిస్తూ గిరిజనేతరులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కార్పోరేట్ కంపెనీలు స్వార్ధ ప్రయోజనాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జీవనోపాధి కోసం సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగంపై నిర్బంధాలను ప్రయోగించి జైళ్ళకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయనే విషయాన్ని గమనంలో ఉంచుకొని ఇప్పటికైనా కేసులు, నిర్బంధాలను ఆపి అటవీ హక్కులచట్టం ప్రకారం పోడుసాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడుదక్కేవరకు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు కున్సోత్ ధర్మా, కొండపల్లి శ్రీ్ధర్, ఇట్టి వెంకట్రావ్‌లు ప్రసంగించగా మండల సహాయ కార్యదర్శి వీర్ల రమేష్ అధ్యక్షత వహించారు. నాయకులు భూక్య రమేష్, దొడ్డా రవికుమార్, సర్పంచ్ కాసాని లక్ష్మి, ఎస్ లక్ష్మి, గూడెపూరి రాజు, జునుమాల నగేష్, వాంకుడోత్ అమర్‌సింగ్, మేరుగు ముత్తయ్య, కె సత్య, నూనావత్ సూర్య, అన్నవరపు ఇందిరా, లావూడ్యా సత్యనారాయణ, డి వీరన్న, ఎండి జలాల్, క్రాంతికుమార్, రహీం, ఎలగొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.