ఖమ్మం

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో జెసి దివ్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పట్టుదలతో పనిచేసిన వ్యక్తి జయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కమర్తపు మురళీ, నారాయణరావు, బోడేపుడి రమేష్, చింతనిప్పు కృష్ణ చైతన్య, తిరుమలరావు, వెంకట్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు బొర్రా రాజశేఖర్, వెంకటరెడ్డి, జైపాల్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ సేవలు
మరువలేనివి : జెడ్పీ చైర్మన్
ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమం సమయంలో చేసిన సేవలు మరువలేనివని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్‌లో జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయాలను
సాధిద్దాం : డిసిసిబి చైర్మన్
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. శనివారం డిసిసిబిలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఈఓ నాగ చెన్నారావు, అధికారులు పద్మావతి, వేణుగోపాల్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో జెడిఏ మణిమాల జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జయశంకర్ మహోన్నత వ్యక్తి :
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కార్పొరేషన్ మేయర్ పాపాలాల్ అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, కమిషనర్ బొనగిరి శ్రీనివాస్, కార్పొరేటర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయసాధనకు కృషి : సమాచార శాఖ ఏడి మూర్తుజా
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేద్దామని సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు మహ్మద్ మూర్తుజా అన్నారు. జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిఆర్వో శ్రీనివాసరావు, వల్లోజి శ్రీనివాసరావు, మంగతాయి, చావా నారాయణరావు, కృష్ణ, వాల్యా, రమణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్‌హెచ్‌పిఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆయా సంఘాల, పార్టీల నాయకులు పాల్గొన్నారు.