ఖమ్మం

ఎర్రుపాలెంలో సివిల్ సప్లైస్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, ఆగస్టు 11: ఎర్రుపాలెం మండలంలో బుధవారం తెల్లవారజామున సివిల్ సప్లై అధికారుల ప్రత్యేక బృందం దాడిచేసి 200 క్వింటాళ్ల అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య ఆదేశాలతో సివిల్‌సప్లై డిటిలు వి మహేష్, కె శ్రీనివాస్, రంజిత్‌కుమార్, ఆర్‌ఐలు ఏ రామచందర్‌రావు, సునీల్‌కుమార్, కృష్ణప్రసాద్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. పెద్దగోపవరం గ్రామంలో నేరెళ్ళ వెంకటేశ్వర గృహంలో వందక్వింటాళ్ల బియ్యాన్ని, బనిగండ్లపాడు గ్రామంలో మైలవరపు మల్లిఖార్జున్‌రావు, షేక్ సుభాని గృహాల్లో నిల్వ చేసిన వందక్వింటాళ్ళ బియ్యాన్ని ఏకకాలంలో దాడులు చేసి పట్టుకున్నారు. బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేయనున్నట్లుతెలిపారు. గత మూడునెలల క్రితం ఇదే గ్రామంలో అప్పటి తహశీల్దార్ బైరెడ్డి సమ్మిరెడ్డి 70క్వింటాల బియ్యాన్ని దాడిచేసి పట్టుకున్నారు. ఈ సంఘటన మరువక ముందే మరలా అక్రమ నిల్వలు చేయడం గమనార్హం. మండలంలో రేషన్ డీలర్ల నుండి, లబ్ధిదారుల నుండి పలువురు వ్యాపారులు రేషన్‌బియ్యాన్ని విక్రయాలు జరిపి ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక అధికారులు చూసీచూడనట్లు వదిలివేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న ఈ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.