ఖమ్మం

రేషన్‌లో కోత విధిస్తే ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, మార్చి 27: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే రేషన్‌లో కోత విధించేందుకు కుట్రపన్నుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ ఆరోపించారు. పేదల నోటికాడి ముద్దను లాక్కుంటే చూస్తూవూరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం స్థానిక మంచికంటి భవన్‌లో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెంగాణలోని టి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తుందని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం బడ్జట్‌లో నిధులను మంజూరు చేయట్లేదని విమర్శించారు. నిత్వవస ధరలు విపరీతంగా పెరుగుతుంటే ధరలని నియంత్రణ చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతు రేషన్‌లో పంపిణీ చేసే నిత్యవసర సరుకులైన కందిపప్పు, నూనె, గోదుమలు తదితర వస్తువులపై కోత విధిస్తుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపి ఎం ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలను నిర్వహంచేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మావేశంలో సిపి ఎం రాష్టక్రమిటీ నాయకులు కాసాని ఐలయ్య, జిల్లానాయకులు అన్నవరపు కనకయ్య, కొండపల్లి శ్రీ్ధర్, కున్సోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, ఎర్రగాని కృష్ణయ్య, జాటోత్ కృష్ణ, వీర్ల రమేష్, లక్ష్మీ, వాంకుడోత్ కోబాల్, నలమల సత్యనారాయణ, చప్పిడి వెంకటేశ్వర్లు, భూక్యా బాబు, వీరస్వామి, అరుణ, లక్ష్మీ, పాష, జలాల్, లావుడ్యా సత్యనారాయణలు పాల్గొన్నారు.