ఖమ్మం

సంక్షేమ పథకాల ప్రచారకులుగా కళాకారుల సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 26: ప్రజా సంక్షేమం, కళాకారుల అభ్యున్నతి కోసమే తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సమాచార శాఖ సహాయ సంచాలకులు మహ్మద్ మూర్తుజా అన్నారు. శుక్రవారం స్థానిక రిక్కాబజార్ పాఠశాలలో జానపదకళాకారుల జాతర ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పేద దరిచేర్చేందుకు కళాకారుల ప్రోత్సాహం కూడా కీలకమేనన్నారు. కళాకారులు సంక్షేమ కార్యక్రమాలను కళారూపాల్లో అందించి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, డిపిఆర్వో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.