ఖమ్మం

చింతకాని మండలంలోభారీవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, ఆగస్టు 30: చింతకాని మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం కుండపోతగా వర్షం కురియడంతో ఎండుతున్న పంటలు ఉపిరిపీల్చుకున్నాయి. గత నెల రోజులుగా వర్షం కురవకపోవడంతో ఎండుతున్న పైర్లు జీవంపోసుకున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వరిసాగు చేసిన రైతులు ఉరటచెందారు. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు మూడుధపాలుగా వర్షం కురిసింది. ముఖ్యంగా పందిళ్ళపల్లి, బొప్పారం, నామవరం, నాగులవంచ, చింతకాని, నేరడ, చిన్నమండవ, సీతంపేట, పాతర్లపాడు, వందనం, కొదుమూరు, రామకృష్ణాపురం, బస్వాపురం, లచ్చగూడెం గ్రామాలలో భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా వర్షం కురిసింది. మరో రెండు, మూడు రోజులు ఇలానే వర్షాలు పడితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.