ఖమ్మం

పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 30: శ్రీరాం సాగర్ రెండో దశ ప్రధాన కాల్వ, బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించి ధ్రాన కల్వ, బ్రాంచ్ కెనాల్స్‌లను నిర్ధేశించిన అలైన్‌మెంట్ ప్రకారం పనులు చేపట్టాలన్నారు. రోడ్లు, మిషన్ కాకతీయ, ఇతరత్రా పనులు వర్షాకాలం వల్ల జరగటం లేదని, వాటికి సంబంధించిన యంత్రాలను వినియోగించుకొని కాల్వ పనులను వేగవంతం చేయాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కావాల్సిన అవసరమైన భూమి నిర్ణయించిన పక్షంలో ఆ భూమిని రెవెన్యూ అధికారులు సమీకరిస్తారని, అలాంటి ఏమైనా ఉన్న పక్షంలో తనకు తెలియచేయాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ రెండో దశ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రైతుల నుంచి తీసుకున్న భూమికి నష్ట పరిహఆరం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినందున ఆయా బ్యాంకర్లు, రైతు ఖాతాలో డిపాజిట్ అయిన సమాచారం తెలుసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లోకి వెళ్ళి రైతుల సమక్షంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య మాట్లాడుతూ భక్తరామదాసు రెండో దశ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణలో భాగంగా రైతుల భూముల్లో చెట్లు, వ్యవసాయ బావి, బోరు బావి, పైపులకు సంబంధించిన నష్ట పరిహారం విలువ సేకరించి నివేదికలు ఇవ్వాలని ప్రాజెక్ట్ ఇంజనీర్లను ఆదేశించారు. చెట్లు ఉన్న పక్షంలో డిఎఫ్‌ఓకు వివరాలను అందచేయాలన్నారు. మిగతా వాటికి ఇంజనీర్లు నష్ట పరిహఆరం నివేదించాలన్నారు. సేకరించిన భూమి అవసరమైనది కానిది తెలియచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఇఇ చావా శ్రీనివాసరావు, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్ వెంకారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీలత, నర్సింహారావు, డిటి మీనన్ తదితరులు పాల్గొన్నారు.