ఖమ్మం

జిల్లాల పునర్విభజన శాస్ర్తియంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్విభజన శాస్ర్తియంగా ఉండాలని, గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యంతో కలసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ జిల్లాల విభజన దసరా అంటూ హడావుడి చేయకుండా స్థానిక ప్రజల అభీష్టంమేరకు శాస్ర్తియంగా నూతన జిల్లాల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఏడు మండలాలను పోగొట్టుకున్నామని, గార్ల, బయ్యారం మండలాలను జిల్లాను నుంచి పోగోట్టుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. అపార ఖనిజసంపద ఉన్న మండలాలను విడగొట్టడం వెనుక కుట్ర దాగి ఉందని, బయ్యారం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరించే అవకాశం ఉందని అనుమానం కలుగుతుందన్నారు. ఈ రెండు మండలాలను జిల్లా నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానిది హామీల పాలనగా మిగిలిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ప్రాజెక్ట్‌ల పేరుతో అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దంటూ హితవు పలికారు. నగరంలో స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పాలకులు ముందుకు రావాలని ప్రజల అభిప్రాయాల మేరకే వ్యవసాయ మార్కెట్‌ను తరలించాలని సూచించారు. అవసరం లేని భూములంటూ 11వేల గజాలను మమత ఆసుపత్రికి ఎన్‌ఎస్‌పి భూములను కట్టబెట్టారని, అందుకు ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని దీనిపై ఉన్నతాధికారులను కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో నాయకులు రాంగారావు, రాంమనోహర్, ఫజల్, తాజ్, బాలాజిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.