ఖమ్మం

కాళోజీకి ఘనంగా నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 9: ప్రజా కవి కాళోజి నారాయణరావు 102వ జయంతి వేడుకలను నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయలతో పాటు విద్యా సంస్థల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన తెలంగాణ ఉద్యమం, భాషా, యాసకు చేసిన సేవలను కొనియాడారు. కాళోజి జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం కాళోజి చిత్రపటానికి కలెక్టర్, జెసి పూలమాలలు వేసి ఆయన తెలుగు భాషా అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. జెడ్పి కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కాళోజి నారాయణరావును స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి పురస్కరించుకొని మేయర్ పాపాలాల్, కమిషనర్ పి శ్రీనివాస్ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. తెలుగు బాషాభివృద్ధికి కాళోజి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ, సాంఘిక చైతన్యలకు కాళోజి ఆదర్శంగా నిలిచారని సమాచార పౌరసంబంధాలశాఖ సహయ సంచాలకులు మహ్మద్ ముర్తుజా పేర్కొన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పౌర సంబందాలశాఖ కార్యాలయంలో కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కాళోజి తెలంగాణ ఉద్యమ ప్రతిద్వని అని కొనియాడారు. ఆనంతరం వివిధ పాఠశాలలో విద్యార్ధిని, విద్యార్ధులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి.