కర్నూల్

కృష్ణా పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, నవంబర్ 21:వచ్చే ఏడాది జిల్లాలో నిర్వహించే కృష్ణా నది పుష్కరాలకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. 2016లో నిర్వహించే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై నదీ పరివాహక ప్రాంత మండల స్థాయి అధికారులతో శనివారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం పుష్కర ఘాట్లు, రోడ్లు, అప్రోచ్‌రోడ్లు, బస్సు సౌకర్యం, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై త్వరలో సిఎం సమావేశం నిర్వహిస్తారని అందుకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో పుష్కర ఘాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యనికి గురి కాకుండా, లక్షల సంఖ్యలో భక్తులు స్నానాలు చేయడానికి కొత్త పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలన్నారు. గత పుష్కరాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్య, మరుగుదొడ్లు, శానిటేషన్, స్నానాలకు 10 రెట్లు భక్తులు పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2 నుండి 3వేల బస్సులు వచ్చినా పార్కింగ్ స్థలం, స్వామి అమ్మవార్ల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నిరకాల ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని పంపాలని దేవాదాయ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇలు చంద్రశేఖరరావు, సురేంద్రనాథ్, శ్రీనివాస్‌రెడ్డి, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి, క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు