కర్నూల్

నివురు గప్పిన నిప్పు.. రాజోలిబండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 23:మూడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) నివురుగప్పినా నిప్పులా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆనకట్ట ఎత్తు పెంచాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి వచ్చిన కర్ణాటక అధికారులను కర్నూలు జిల్లా రైతులు అడ్డుకుంటున్నారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచాలన్న కర్నాటక నిర్ణయానికి తెలంగాణ వత్తాసు పలుకుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీని కారణంగా పనులు నిలిచిపోయినా కర్ణాటక ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు వత్తిడి తీసుకువస్తుండటంతో కర్నూలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండా పనులు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని కర్ణాటక అధికారులకు తేల్చి చెప్పారు. ఆర్డీఎస్ వద్ద రోజుకో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే కర్నూలు జిల్లాలోని సుమారు 400 ఎకరాల సాగు భూమి ముంపునకు గురవడమే కాకుండా తుంగభద్ర జలాల్లో అత్యధిక భాగం కర్నాటక, తెలంగాణ తరలించుకుపోతాయని కర్నూలు రైతులకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమస్యపై చర్చించి సామరస్యంగా పరిష్కార మార్గాలను కనుగొన్న తరువాతా ఎత్తు పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమస్య పరిష్కారం కంటే కయ్యానికి కాలు దువ్వడానికే ఇష్టపడితే వచ్చే ప్రమాదాలకు బాధ్యులెవరని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆర్డీఎస్ ఎత్తు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏంటన్నది వెల్లడించడం లేదు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ అధ్యయనంలో సమస్య ఉందని నిపుణులు, అధికారులు నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే కర్ణాటక అధికారులు మాత్రం అవకాశం లభిస్తే పనులు ప్రారంభించడానికి సిద్ధపడుతుండటంతో పోలీసులను బందోబస్తు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.

కోసిగిలో విషాదం
* నలుగురిని బలిగొన్న బుగేని చెరువు

ఆదోని/కోసిగి, మే 23: ఆదోని డివిజన్‌లోని కోసిగి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం బుగేని చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు బాలురు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కోసిగిలో విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారంతా కూడా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థులే. వేసవి సెలవులు కావడంతో సరదాగ ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి ఈత కొడుతుండగా బురదలో కూరుకుపోయి కోసిగికి చెందిన బోయ వెంకటేష్, లక్ష్మీల కొడుకు బోయ నరసింహులు(10), ఈరన్న, ఉరుకుందమ్మల కొడుకు అయ్యప్ప(8), దూదిగాడు, రంగమ్మల కొడుకు వెంకటేశ్వర్లు(10), కురువ రాగప్ప, మహదేవిల కొడుకు కురువ నరసింహులు(8) మృతి చెందారు. అయితే మృతి చెందిన వెంకటేశ్వర్లుతోపాటు అతని సోదరులు తిప్పయ్య, గోవిందు కూడా ఈతకు వెళ్లారు. అయితే వీరు నలుగురు చెరువులో మునిగిపోవడంతో భయంతో చెరువు గట్ట మీదకు వచ్చి కేకలు వేస్తూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండ్ల వద్దకు చేరుకున్నారు. చెరువులో నలుగురు మునిగిన సంఘటన చెప్పడంతో మృతి చెందిన బాలుర తల్లిదండ్రులుతోపాటు గ్రామస్థులు చెరువువద్దకు చేరుకున్నారు. వెంటనే చెరువులో దూకి మునిగిపోయి బురదలో చిక్కుకున్న బాలురలను వెలికితీశారు. అయితే అప్పటికే నలుగురు బాలురులు మృతి చెందిఉండడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు బోరున విలపించారు. ఈ సంఘటన గ్రామప్రజలందరు చెరువు వద్ద చేరుకుని బాలురులు మృతిచెందడంతో కన్నీటిపర్యంతమైయ్యారు. అయితే తల్లిదండ్రులు శవ పరీక్షకు వెళ్తే శవాలను కోస్తారని మృత దేహాలను ఇండ్లకు తీసుకెళ్లడానికి యత్నించారు. ఎస్‌ఐ ఇంతియాజ్‌బాషా, సిఐ కంబగిరి రాముడు, డిఎస్పీ శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని బంధువులుకు శవపరీక్ష అవశ్యకతను వివరించి మృత దేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నలుగురు బాలురు చెరువులో కూరుకొని మృతి చెందిన సంఘటన తెలుసుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హుటాహుటిన ఆదోని ఏరియా ఆసుపత్రికి చెరుకుని మృతి చెందిన బాలుర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసంఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. కోసిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈత కోసం వెళ్లిన నలుగురు విద్యార్థులను చెరువు బలి తీసుకుందని వారి బంధువులు ఆర్తనాదాలు పెట్టారు. ఈ సంఘటనతో కోసిగిలో విషాదఛాయలు అలుముకున్నాయి.