కర్నూల్

పడమర ప్రాంత కరవు నివారణకు శాశ్వత పథకాలే శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 3: నిత్య కరవును ఎదుర్కొంటున్న జిల్లాలోని పడమర ప్రాంతంలో రెయిన్‌గన్ల ద్వారా పంటలు కాపాడామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా ఇది తాత్కాలికమేనని.. శాశ్వత పథకాలెక్కడ అన్న అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కరవుపై యుద్ధం ప్రకటించినట్లుగానే సాగునీటి సమస్యపై యుద్ధం చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆ రంగం నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి కృషి చేస్తే పడమర రైతులకు మంచి భవిష్యత్తును చూపించవచ్చంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినా నిత్య కరవుపీడిత ప్రాంతమైన ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్ నియోజకవర్గాల్లో అరకొర వర్షం కురిసింది. అంతేగాకుండా ఈ నియోజకవర్గాలకు శాశ్వత సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు ప్రతి ఏటా పంట కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షంతో భవిష్యత్తుపై ఆశతో రైతులు సాగు చేసిన పంట ఆగస్టులో వర్షాభావంతో ఎండిపోయే దశకు చేరుకుంది. దాంతో ప్రభుత్వం రెయిన్‌గన్లను వినియోగించి ఒక తడి నీటిని అందించగలిగినా ఇది శాశ్వత పరిష్కారం కాదన్నది రైతుల అభిప్రాయం. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ ప్రభుత్వ యంత్రాంగం కదలడం సాధ్యమయ్యే పనికాదని శాశ్వతంగా కాలువల్లో నీటి పారుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిఎం చంద్రబాబు అరికెర గ్రామంలో రైతులతో మాట్లాడిన తరువాత హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల కోసం రూ. 750కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించడం హర్షణీయం అయినా ఆ కాలువ శ్రీశైలం జలాశయంపై ఆధారపడి ఉందన్న విషయం మరువకూడదని రైతులు పేర్కొంటున్నారు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు ఎంతో ఉపయోగపడే వేదావతి నదిపై ఎత్తిపోతల పథకం గత దశాబ్దాల కాలంగా రైతుల కలగా మిగిలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో సిఎం చంద్రబాబు వేదావతి ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఇంతవరకూ అడుగు కూడా ముందుకు కదల లేదని రైతులు వాపోతున్నారు. ఇక ఇప్పటికే ఉన్న తుంగభద్ర దిగువ కాలువ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం కూడా పడమర ప్రాంత రైతులకు శాపంగా మారందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు అనుసంధానంగా ఉన్న ఆలూరు బ్రాంచి కాలువకు కూడా నీటి విడుదల విషయంలో జరుగుతున్న అన్యాయం జగమెరిగిన సత్యమేనని పేర్కొంటున్నారు. సిఎం చంద్రబాబు తాజాగా ప్రకటించిన హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి కావాలంటే సమయం ఎక్కువగా పడుతుందని ఈ లోగా ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తే దిగువ కాలువ, వేదావతి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించవచ్చని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాభావం, భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకోవడంతో పడమర ప్రాంత రైతులు దినదిన గండం గడుపుతున్నారని వారంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్లెల్సీ, ఏబిసి సమస్యలను పరిష్కరించి నీటి పారుదల సవ్యంగా ఉంటే భూగర్భ జలాల్లో భారీ వృద్ధి సాధ్యమవుతుందని వెల్లడిస్తున్నారు. దీని కారణంగా బావులు, బోర్లలో నీరు చేరి పంటలకు సకాలంలో నీరందించవచ్చని పేర్కొంటున్నారు.
హంద్రీనీవా నుంచి
కెసికి నీరు మళ్లిస్తాం..
* పనులను పరిశీలించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు
నందికొట్కూరు, సెప్టెంబర్ 3: ప్రభు త్వ ఆదేశాల మేరకు కృష్ణా జలాలను కెసి కాలువకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. మండల పరిధిలో ని మల్యాల గ్రామ సమీపంలో వున్న హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథ కం వద్ద కృష్ణా జలాలను కెసి కాలువకు మళ్లించేందుకు చేపట్టిన పనుల ను శనివారం కలెక్టర్‌తో పాటు ఎమ్మె ల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బమ్మ, మాండ్ర శివానందరెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి అశోకరత్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేసి ఆయకట్టు రైతులను ఆదుకుంటామన్నారు. శిల్పా మాట్లాడుతూ నందికొట్కూరు ప్రాంత కెసి ఆయకట్టు రైతాంగం దుస్థితిని మాండ్ర సిఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించిందన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ నెల 6వ తేదీ ఒక పంపు నుంచి 400 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభిస్తామని, 10న రెండు పంపుల ద్వారా రోజుకు 800 క్యూసెక్కుల నీటిని కెసి కాలువకు విడుదల చేస్తామన్నారు. ఈ నీరు మల్యాల నుంచి 120 కి.మీ వరకూ పంపింగ్ చేస్తామని, అల్లూరు, పడిదెంపాడు వద్ద నిర్మించిన కెసి ఎత్తిపోతల పంప్‌హౌస్ నుంచి నీటిని సుంకేసుల వైపు ఎత్తిపోసి ఎగువ ప్రాంతంలో పంటలు సాగు చేసే రైతులకు కూడా నీరందిస్తామన్నారు. ఈ మేరకు మోటార్లు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. హంద్రీనీవా పంపింగ్ స్టేషన్ నుంచి మరో 2 పంపు ల ద్వారా అదనంగా కెసికి నీరు మళ్లించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. వారితో పాటు ఎంపిపి వీరం ప్రసాదరెడ్డి, టిడిపి నాయకులు రామ య్య, గిరీశ్వరరెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.