కర్నూల్

మంత్రివర్గంలోకి అఖిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 12:రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుంచి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఇంత కాలం జాప్యమైంది. ఎట్టకేలకు దసరా కంటే ముందుగానే మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయానికి వచ్చిన సిఎం చంద్రబాబు ఇటీవల విదేశాలకు వెళ్లిన సందర్భంలో కసరత్తు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా మంత్రివర్గంలో భూమా నాగిరెడ్డికి బదులు ఆయన కుమార్తెకు అవకాశం కల్పించాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై నాగిరెడ్డికి కూడా సమాచారం పంపినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ సమయంలో ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరు మహిళా మంత్రులను పక్కన పెట్టాలని సిఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారి స్థానంలో అఖిలప్రియను మంత్రివర్గంలో చేర్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో నాగిరెడ్డికి బదులు ఆయన కుమార్తె విషయంలో చంద్రబాబు స్పష్టతకు వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ పదవి మరోమారు జిల్లాకు దక్కడం ఖాయమన్న అభిప్రాయం నాయకుల్లో ఉంది. ఈ పదవికి గతంలో ఆలోచించినట్లుగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా ఈ సారి ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీలో సీనియర్ నాయకులకు ఆ పదవి ఇవ్వాలన్న డిమాండ్‌పై కూడా చంద్రబాబు ఆలోచిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పదవికి జిల్లాలోని సీనియర్ నాయకులైన మీనాక్షినాయుడు, బిటి నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు రెండు పదవులు ఖాయమన్న భావన పార్టీ నేతల్లో ఉంది.