కర్నూల్

ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 24 : ఎస్సీ, ఎస్టీ సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని ఎస్టీబిసి కళాశాల మైదానంలో సోమవారం ప్రభుత్వ పథకాలు, సబ్‌ప్లాన్ పథకాల అమలు, వాటి ఉపయోగాల గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు చేపట్టిన వాడవాడలా చంద్రన్న దళితబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా కెఇ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుం డా ఆస్తుల పంపిణీ కార్యక్రమం, 13 జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొట్టమొదటగా రాయలసీమకే తలమానికమైన కర్నూలు పట్టణంలో ప్రారంచారన్నా రు. అంటరానితనం, వివక్షను పూర్తిగా నిర్మూలిస్తేనే సామాజికాభివృద్ధి సమానంగా జరుగుతుందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్య కలను నిజం చేసే అంబేద్కర్ ఓవరర్‌సీస్ విద్యానిధి, అత్యున్నత చదువులైన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా ఎన్‌టిఆర్ విద్యావృత్తి పథకం, ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా నిధుల కేటాయింపు, నిరుద్యోగ యువతుకు చేయూత ఇచ్చేందుకు చంద్రన్న చేయుత కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. సాం ఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు గతంలో కాగితాలకే పరిమితమయ్యాయని, అయితే చంద్రబాబు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తానున్నానని చెబుతూ పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ సబ్‌ప్లాన్ అమలు తీరుతెన్నులపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చంద్రన్న దళితబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇక అన్ని హాస్టళ్లను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మార్చడానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. అలాగే నాణ్యమైన విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించుట, సాంకేతిక పరిజానం తద్వారా విద్యార్థులు ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర చరిత్రలో గత 60 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రుణాలు, ఆస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. రూ. 2 వేల కోట్ల ఖర్చుతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ కాలనీల్లో రోడ్లు నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా డిఆర్‌డిఎ శాఖ ద్వారా 2,735 ఎస్సీ, ఎస్టీ బృందాలకు రూ. 43 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కును, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 226 మంది లబ్ధిదారులకు 3 చెక్కులను కెఇ అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, ఎమ్మెల్సీ సుధాకరబాబు, ఎమ్మెల్యే మణిగాంధీ, ఆకేపోగు ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, కలెక్టర్ విజయమోహన్, జెసి హరికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
యువభేరికి విద్యార్థులను
పంపొద్దు!
* కళాశాలలకు ప్రభుత్వ హుకుం..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, అక్టోబర్ 24 : కర్నూలులో మంగళవారం వైకాపా అధినేత జగన్ నిర్వహించనున్న యువభేరి కార్యక్రమానికి విద్యార్థులను పంపవద్దని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యానికి అధికారులు వౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, యువతకు ఉద్యోగాల కల్ప న, నిరుద్యోగ భృతి చెల్లింపు, హామీల అమలు, తదితర అనేక అంశాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు జగన్ కర్నూలులో మంగళవారం యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 15 నుంచి 20వేల మంది విద్యార్థులను తరలించాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరారు. అయితే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో యువభేరి కార్యక్రమానికి పంపవద్దని అధికార పార్టీ నేతల సూచనలతో విద్యాశాఖ అధికారులు వౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏ విద్యా సంస్థ వారైనా పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. విద్యార్థులు హాజరు కాని పక్షంలో జగన్ సమావేశం నీరుగారుతుందని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ఓ వైపు వౌఖిక ఆదేశాలు జారీ చేయించిన ఆ పార్టీ నేతలు మరోవైపు వైకాపా అధినేత జగన్ అవినీతిపరుడన్న కారణంగా విద్యార్థులు ఆయన సమావేశానికి హాజరు కావడానికి విముఖంగా ఉన్నారని ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
కార్పొరేట్‌కు దీటుగా
మున్సిపల్ పాఠశాలలు
* పురపాలక శాఖ మంత్రి నారాయణ
కర్నూలు సిటీ, అక్టోబర్ 24:రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది, సామాన్య, పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మం త్రి పి.నారాయణ తెలిపారు. నగరంలోని మాసా మసీదు సమీపంలో ఉన్న ఎంఆర్‌సి కనె్వన్షన్ హాలులో సోమవారం ఐఐటి కెరీర్ ఫౌండేషన్ కోర్సును అభ్యసిస్తున్న మున్సిపల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, వా రి తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించి దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే మూడేళ్లలో అన్ని మున్సిపల్ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్స్‌తో పాటు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మున్సిపల్ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ముందుండాలనే లక్ష్యంతో అన్ని పాఠశాలల్లో ఐఐటి కేరీర్ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టామని, ఈ కోర్సు ద్వారా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఏవిధంగా రాణించాలన్న అంశంపై అవగాహన వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో దాదాపు 36వేల మంది విద్యార్థులు ఈ కోర్సును సద్వినియోగం చేసుకుంటున్నారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ ఏ ఒక్క మున్సిపల్ పాఠశాల అరకొర సౌకర్యాలతో ఉండకూదని, ప్రతి పాఠశాలలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా తాగునీటి వల్లే ఎక్కువగా రోగాలు వస్తున్నాయని, దీంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శుద్ధిచేసిన నీరు అందిస్తామన్నారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ కెరీర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ కావాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యార్థులను విద్యలో ఉన్నతమైన శక్తిగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలాంటి కోర్సులు ఎంతో దోహదపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మెప్మా సిఎండి చిన్నతాతయ్య, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, డిఇఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
బయో మందుల అక్రమ నిల్వలపై
అధికారుల దాడులు
* రూ. 10 లక్షల విలువ చేసే మందులు సీజ్
కోడుమూరు, అక్టోబర్ 24:పట్టణంలో సోమవారం భారీగా బయో మందుల నిల్వలు బయటపడ్డాయి. పట్టణంలో పెద్దఎత్తున నకిలీ విత్తనాలు, నకిలీ బయో మందుల నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందడంతో ఉదయం పట్టణంలోని పలు పెస్టిసైడ్స్ దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని క్రాంతి ట్రాన్స్ పోర్టులో మహాలక్ష్మీ, పల్లవి పెస్టిసైడ్స్ డీలర్లు అక్రమంగా నిల్వ ఉంచిన బయో మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మరొక చోట కూడా ఒక ఇంటిలో నిల్వ ఉంచిన నకిలీ బయో మందులను అధికారులు సీజ్ చేశారు. పట్టణంలో మరి కొందరు నకిలీ మందులను రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచినట్లు సమాచారం. బయో మందుల నిల్వలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వ్యాపారాలను బయటకు పొక్కకుండా ఉండేందుకు వ్యాపారులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పథకం వేశారు. ఈ పథకం అధికారులకు తెలియడంతో వీటిపై దాడులు నిర్వహించారు. ఆ రెండు దుకాణాలకు సంబంధించి దాదాపు రూ. 10 లక్షల విలువచేసే బయో మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా తెలిపారు. నకిలీ బయో మందులను విక్రయించిన వారిపై ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా స్థానిక పెస్టిసైడ్స్ వ్యాపారుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా కొందరు వ్యాపారులే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆదోనిలో ఇంటింటికీ
కుళాయి కనెక్షన్:ఎమ్మెల్యే సాయి
ఆదోనిటౌన్, అక్టోబర్ 24: పట్టణంలోని వాడవాడలో ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో అమృత్ పథకం కింద రూ.10.5 కోట్లతో పట్టణంలో పైపులైన్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద ఎల్లెల్సీ కాలువ నుంచి రామజల కు రూ. 1.6 కోట్లతో జరుగుతున్న పైపులైన్ పనులను ఆయన పరిశీలించారు. అలాగే ఫిల్టర్ బెడ్లను పరిశీలించి పూర్తిస్థాయిలో పనులు చేయాలని ఆదేశించారు. ఎస్‌ఎస్ ట్యాంకు కాలువ నుంచి సుమారు 14 మోటార్లతో జరగుతున్న నీటి పంపింగ్‌ను పరిశీలించి వచ్చే వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలో పట్టణంలో 13వ ఆర్థిక సంఘం కింద రూ. 1.5 కోట్లతో మరుగునీటి కాలువ నిర్మా ణం పనులు, రూ.25 లక్షలతో ఇందిరానగర్‌లో పైపులైన్ పనులు రూ. 40 లక్షలతో మండిగిరి కాలనీలో రోడ్డు పనులు, రూ. 20 లక్షలతో లక్ష్మమ్మ నగర్‌లో పైపులైన్ పనులు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఇంటి వద్దకు ప్రధాన పైపులైన్ వేస్తామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కొళాయి కనెక్షన్లు తీసుకోవాలని కోరారు. బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద నుంచి చేపట్టిన పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు సకాలంలో చేయకపోవడంతో ప్రభుత్వాలు మం జూరు చేసిన నిధులు వెనక్కు వెళ్తున్నాయని, దీనిపై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సరోజమ్మ, వైస్ చైర్మన్ అల్త్ఫా అహ్మద్, కోఆప్షన్ సభ్యులు చంద్రకాంత్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ రాముడు, ఏ వన్ కాంట్రాక్టర్ గోవర్థన్‌రెడ్డి, వైకాపా నాయకులు ఇబ్రహీం, సాయిరామ్, ఈరన్న పాల్గొన్నారు.
సాయి మందిర నిర్మాణంలో
భాగస్వాములవ్వండి
* డోన్‌లో సాయి భక్తుల భారీ ర్యాలీ
డోన్, అక్టోబర్ 24:పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కన నిర్మించతలపెట్టిన శ్రీ సాయి మందిర నిర్మాణానికి నవంబర్ 4వ తేదీ భూమిపూజ కార్యక్రమం ఉంటుందని, అందులో సాయి భక్తులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. శ్రీసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం డోన్ పట్టణంలో సాయి భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీపంలోని గుత్తిరోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ కొండపేట, బేతంచెర్ల క్రాస్‌రోడ్డు, పాతపేట, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, ఇందిరానగర్, తారకరామనగర్, కోర్టురోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకూ కొనసాగింది. ర్యాలీలో జై సాయిరామ్, జైజై సాయిరామ్, సాయినాథ్ మహారాజ్‌కి జై అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. భూమిపూజలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ డోన్ పట్టణ సమీపంలోని ఉడుములపాడుకు వెళ్లే దారిలో జాతీయ రహదారి పక్కన 1.5 ఎకరాల స్థలంలో సాయి మందిర నిర్మాణం తలపెట్టినట్లు తెలిపారు. నవంబర్ 4వ తేదీ భూమిపూజ కార్యక్రమం ఉంటుందని, అందులో భాగంగా 2 వేల మంది దంపతులతో పూజా కార్యక్రమం చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో పట్టణ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు. అలాగే ఆలయ నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ ఒక ఇటుకనైనా సమర్పించి భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి వెంకట రమణగౌడ్, ధర్మవరం సుబ్బారెడ్డి, పోచా ప్రభాకరరెడ్డి, రంగరత్నంగౌడ్, పుల్లారెడ్డి, ఆలువాల సత్యం, శివరామిరెడ్డి, గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిమెంటు రోడ్డు వేయాలి
* సంజీవనగర్ కాలనీవాసుల ఆందోళన..
* మహాసిమెంట్ లారీలను అడ్డుకున్న వైనం
బేతంచెర్ల, అక్టోబర్ 24:పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో గూడ్స్‌లోడింగ్ కోసం రైల్వేస్టేషన్‌కు సిమెంట్ తరలించే లారీల వల్ల చెలరేగె దుమ్ము ధూళితో తల్లడిల్లిపోతున్నామని, కాలనీలో సిమెంట్‌రోడ్డు వేయాలని సోమవారం రాత్రి సంజీవనగర్ కాలనీ మహిళలు, కాలనీవాసులు మహాసిమెంట్ లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన అమ్మన్ని, తిమ్ములు, హనుమాన్‌నగర్‌కు చెందిన వెంకటలక్ష్మమ్మతో పాటు పలువురు కాలనీవాసులు లారీలకు అడ్డంగా నిలబడ్డారు. రోడ్డుపై లారీలు అధిక బరువుతో రోడ్డు సామర్థ్యానికి మించి తిరుగుతుండడంతో రాళ్లు ఎగిరిపడి గాయాలవుతున్నాయని వాపోయారు. అలాగే దుమ్ముధూలితో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తూ లారీలను అడ్డుకున్నారు.
మహాసిమెంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుగ్గన ఆహ్రం
కాలనీవాసులు లారీలను నిలిపివేసిన విషయాన్ని తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పొంతనలేని మాటలు చెబుతున్న మహాసిమెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి కాలనీ వాసులు కాలుష్యంతో సతమతమవుతున్నారని, కావున సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పినా పట్టించుకోరా అని డిజిఎం రామరాజుతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. కనీసం యాజమాన్యంతో నేరుగా మాట్లాడలేని మీరు ఏం నిర్ణయం తీసుకుంటారన్నారు. నిర్ణయం తీసుకునేవాళ్లు వచ్చేంత వరకూ లారీలు కదలవని హెచ్చరించారు. అలాగే కాలనీ వాసులు రాత్రి పొద్దుపోయేంత వరకూ లారీలను అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఐ తిరుపాలు, పోలీసులు సంఘటన స్థలంలో బందోబస్తు నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
అట్టహాసంగా ప్రారంభం
నందికొట్కూరు, అక్టోబర్ 24:పట్టణంలోని అక్షరశ్రీ పాఠశాల ఆవరణలో సోమవారం రాష్టస్థ్రాయి అండర్-14 కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఈ క్రీడా పోటీలు ఎమ్యెల్యే ఐజయ్య, డిప్యూటీ డిఇఓ తెహరాసుల్తానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అంటేనే కబడ్డీ గుర్తుకువస్తుందని, ఈ క్రీడలో ఇప్పటి వరకూ మూడు ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తే మూడింటిలో ఇండియానే విజయభేరి మోగించిందన్నారు. కబడ్డీ క్రీడకు చిన్న గ్రామం మొదలుకుని అంతర్జాతీయ స్థాయి వరకూ మంచి గుర్తింపు వుందన్నారు. కబడ్డీ క్రీడలో ప్రతిభ వున్న క్రీడాకారులను పెద్దపెద్ద సంస్థలు సైతం ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇటీవల జరిగిన కబడ్డీ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను కూడా పలు వ్యాపార సంస్థల నిర్వాహకులు ప్రోత్సహించారన్నారు. ప్రభుత్వం కూడా విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఓస్పరి సుబ్బమ్మ, ఎంఇఓ రంగారెడ్డి, సిఐ శ్రీనాథరెడ్డి, అక్షరశ్రీ పాఠశాల కరస్పాండెంట్ ప్రశాంత్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్, శ్రీనాథ్, నాగరాజు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉపాధ్యాయుల
సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు సిటీ, అక్టోబర్ 24:మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.సర్వేశ్వరరెడ్డి, జయభరత్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మం త్రి నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు జిపిఫ్ సౌకర్యం లేక పోవటం వల్ల ప్రతి 6 నెలలకు వచ్చే డిఎ అరియర్స్, సిఎస్‌ఎస్‌లోకి పోవడం వల్ల లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను ఆమోదింపజేసి, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పిఇటి పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేసి పదోన్నతి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలల్లో తగినంత నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల ఆ పనిని ఉపాధ్యాయులే చేయాల్సి వస్తుందని, వెంటనే నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించి, వాటి నిర్వహణకు పారిశుద్ధ్య కార్మికులను నియమించి అందుకు అయ్యే ఖర్చును గ్రాంట్ రూపంలో విడుదల చేయాలన్నారు. మున్సిపల్ హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వెంటనే ప్రమోషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు వెంకటనారాయణ, రవి, బుడ్డన్న, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయు ఆధ్వర్యంలో..
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ది స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయు) అధ్యక్షుడు రాముడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మున్సిపల్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి, అన్ని పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు డిఆర్ గోపాల్ రెడ్డి, సుధీర్, గఫార్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్భ్రావృద్ధి
* నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం..
* పురపాలక శాఖ మంత్రి నారాయణ
కర్నూలు సిటీ, అక్టోబర్ 24:డ్వాక్రా సంఘాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. నగరంలోని మాసా మసీదు ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్‌లో సోమవారం పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు 2వ విడత చంద్రన్న పెట్టుబడి నిధి పంపిణీ, నైపుణ్యాభివృద్ధిపై కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. డ్వాక్రా సంఘాలు నైపుణ్యం పెంపొందించుకుని ఆర్థికంగా బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సిఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 2వ విడత రుణాన్ని వచ్చే నెల 1వ తేదీ పంపిణీ చేస్తామన్నారు. అలాగే పెట్టబడి నిధి కింద రూ. 44.13 కోట్లు మంజూరు చేశామని, వాటితో పాటు 730 మహిళా గ్రూపులకు రూ. 25కోట్లు మంజూరు చేశామన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేయటానికి ప్రత్యేకంగా డ్వాక్రా బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మెప్మా సిఎండి చిన్నతాతయ్య, మెప్మా పిడి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
డోన్ రైల్వేస్టేషన్‌లో
గుర్తు తెలియని వ్యక్తి మృతి
డోన్, అక్టోబర్ 24:డోన్ రైల్వే స్టేషన్‌లోని 3వ నెంబర్ ఫ్లాట్‌ఫారంపై 50 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతడు తెల్ల పంచె, గీతల చొక్కా ధరించాడని, చొక్కా కాలర్‌పై జెకె టైలర్స్, విజయవాడ-1 అనే స్టిక్కర్ ఉందని తెలిపారు. గుర్తించగలిగిన వారు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.