కర్నూల్

8న మహోదయం సముద్ర స్నానాలు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 19: వచ్చేనెల 8న మహోదయం సముద్ర స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేంద్రతనయ నది సముద్రంలో కలిసే సంగమం వద్ద స్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుగానే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. బారువ తీరంలో కిలోమీటర్ మేర సముద్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున భద్రతా పరమైన చర్యలు చేపట్టేందుకు సందర్శించి నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ ఉపసంచాలకులకు ఆయన ఆదేశించారు. బహిరంగ మలవిసర్జన నివారించేందుకు స్థానిక సర్పంచ్, యువజన వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 7 నుండి 9వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో మద్యం నిషేదించేందుకు డ్రైడేస్‌గా ప్రకటించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఆర్డివోలు దయానిధి, వెంకటేశ్వరరావు, డి ఎస్పీలు భార్గవరావునాయుడు, శ్రీనివాసరావు, పట్టణ ఆరోగ్య అధికారి డాక్టర్ దవళ భాస్కరరావు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
జలుమూరు, జనవరి 19: మండల కేంద్రం జలుమూరు చల్లవానిపేట పిఎసి ఎస్ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక తహశీల్దార్ ప్రవల్లిక ప్రియ మంగళవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరింత అధిక శాతంలో కొనుగోలు చేపట్టి రైతులకు మరిన్ని సేవలు చేపట్టాలని ఆమె అన్నారు. జలుమూరు కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనగోలు కేంద్రాల లావాదేవీల విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అధిక దిగుబడికి
ఎల్‌బిజి 787 మినప విత్తనం మేలు
జి.సిగడాం, జనవరి 19: మండలం బాతువ గ్రామానికి చెందిన రైతు కలిశెల్లి శంకరరావు తమ పంటపొలంలో ఎల్‌బిజి 787 మినపవిత్తనం రకం వేసి అధిక దిగుబడి సాధించినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎకరాకు పది కిలోల విత్తనం వేసినట్లయితే 11క్వింటాళ్ల వరకు ఫలితం సాధించినట్లు తెలిపారు. విత్తనాలు వేసే ముందు దుక్కిలో ఒక బస్తా యుఏపి , యు రియా వేసినట్లు ఆయన తెలిపారు. విత్తనం నాటిన 27 రోజుల తరువాత మోనోప్రోటోకాస్ ఏసిటేట్ పిచికారి చేసినట్లు ఆయన తెలిపారు. ఇలా క్రమం తప్పకుండా చేసినందువలన 85 రోజులకే అధిక దిగుబడి పొందినట్లు ఆయన తెలిపారు.
‘సీనియర్ న్యాయవాది చౌదరి
సేవలు స్మరణీయం’
పాతశ్రీకాకుళం,జనవరి 19: జిల్లాకోర్టులో సేవలందించిన సీనియర్ న్యాయవాది దువ్వాడ వెంకట శ్రీనివాసచౌదరి మరణం న్యాయవ్యవస్ధకు తీరనిలోటని, వారు అందించిన సేవలు స్మరణీయని జిల్లా ప్రధానన్యాయమూర్తి వి.అప్పారావు చెప్పారు. జిల్లాకోర్టు హాలులో మంగళవారం జరిగిన చౌదరి సంతాపసభలో ఆయన మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది చౌదరి క్రిమినల్ కేసులు చేయడంలో మంచిపేరు సంపాదించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సభలో జిల్లా 1వ అదనపున్యాయమూర్తి సత్యశ్రీ, కుటుంబన్యాయస్థానాల న్యాయమూర్తి గౌతమ్‌ప్రసాద్, ప్రిన్సిపాల్ సీనియర్ న్యాయమూర్తి మేరీ గ్రేసీకుమారి, అదనపుప్రిన్సిపాల్ సీనియర్ న్యాయమూర్తి రాజేంద్రప్రసాద్, ఇతర న్యాయమూర్తులు మాధురి, నాగమణి, సాయిసుధ, వై.శ్రీనివాసరావు,అన్నపూర్ణ, సీనియర్ న్యాయవాదులు పుల్లెల సీతారామయ్య, చిన్నికృష్ణ, తర్లాడ బాలమురళీకృష్ణ, వాన కృష్ణచంద్,సువ్వారి తవిటినాయుడు, పూడి రాంబాబు, పి.వి.రమణారావు, గంగు కృష్ణారావు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ని సూర్యారావు, సంపత్‌కుమార్, భాగ్యలక్ష్మి, అప్పారావు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మీ-సేవ కేంద్రాల పరిశీలన
మందస, జనవరి 19: మండలంలోని బాలిగాం, జిల్లుండ, బహడాపల్లి, సిరిపురం గ్రామాల్లో నూతనంగా మీ సేవ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజూరు చేయడంతో మంగళవారం తహశీల్దార్ శివబ్రహ్మనందం కొత్త మీ సేవ కేంద్రం భవనాలను, కంప్యూటర్లును, ఇతర పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 280 రకాలు వివిధ శాఖలకు సంబంధించి ధ్రువపత్రాలు జారీ చేస్తామన్నారు. సకాలంలో ధ్రువపత్రాలు అందించి మీ సేవ లను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్ ఐలు శివాజీపట్నాయక్, రామకృష్ణ, నిర్వాహకులు శ్రీను, కె.గణేష్, టిడిపి నాయకులు కె. ఆనంద రావు, దుర్యోధన తదితరులున్నారు.
బలవంతపు భూసేకరణ విరమించుకోవాలి
శ్రీకాకుళం(టౌన్), జనవరి 19: రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ విరమించుకోవాలని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద భూ బకాసురుడి పేరుతో దిష్టిబొమ్మ దగ్ధానికి ఆయా సంఘాల నేతలు యత్నించగా, పోలీసులు మఫ్టీలో మోహరించి వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ప్రజా సంఘాల నేతలకు మధ్య తోపులాట చోసుకుంది. దీంతో పోలీసులు నేతలను అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్బంగా సంఘాల నేతలు మాట్లాడుతూ జిల్లాలో కొవ్వాడ, అణువిద్యుత్, పోలాకి థర్మల్ పవర్‌ప్లాంట్, భావనపాడు పోర్టు, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పేర్లతో లక్షల ఎకరాలు బలవంతపు భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పేద జిల్లాగా పేరున్న సిక్కోలులో కార్పొరేట్ సంస్థలకు లక్షల ఎకరాలు అప్పజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టడం, ఇది రాష్టవ్య్రాప్తంగా అమలు చేయడం అన్యాయమన్నారు. తక్షణమే భూసేకరణను ఆపకపోతే రాష్ట్ర ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గతంలో అణువిద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి హోదాలో సహకరిస్తున్నారని విమర్శించారు. సిటు జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.నారాయణరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, ఎం.తిరుపతిరావు, ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
సేవా దృక్పథం అలవర్చుకోవాలి: కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 19: సేవాదృక్పదం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. జూనియర్, యూత్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యుల సమావేశం శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో మంగళవారం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేవాభావం ప్రస్తుత కాలంలో తగ్గుతుందని నీతి, నియమాలు, విలువలు, సేవా వంటి పదాలు నిఘంటువులకే పరిమితవౌతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో చిన్నారులకు నైతిక విలువలు నేర్పించడం ద్వారా సమాజం మంచిబాట పడుతుందన్నారు. కల్మషం లేని మనుషులతో చిన్నారులు ఉంటారని వారిలో నైతిక విలువలు, నీతి నియమాలు, సేవా తత్పరత వంటి అంశాలు నేర్పించడం వలన ఆ భావాలు వ్యాప్తిచెంది పెద్దవారైనప్పటికీ వాటి ప్రభావం ఉంటుందన్నారు. పాఠశాలలో ఆసక్తిగల చిన్నారులను ఇందులో చేర్పించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నేర్చుకున్న నియమాలు జీవితకాలంలో అనుసరించాలని జూనియర్ రెడ్‌క్రాస్ ప్రతినిధులుగా హాజరైన పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలు విస్తృతంగా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా వాటిని ఎదుర్కొనే విధంగా ప్రజలకు బోధించాలన్నారు. పాఠశాల అనంతరం గ్రామంలో విద్యలేని వారికి విద్య నేర్పించడం పట్ల శ్రద్ధ వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రావాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే విధానాన్ని పరిశీలించాలని, విద్యను నేర్పని ఉపాధ్యాయులు మూలంగా విద్యార్థులకు ఉపయోగం ఉండదన్నారు. వసతి గృహంలో వంటలు చేసే విధానాన్ని కూడా పరిశీలించారన్నారు. కాయగూరలను నీటితో శుభ్రంగా కడిగి వండుతున్నారో? లేదో? పరిశీలించాలన్నారు. నోబుల్ బహుమతి గ్రహీత మలాల కేవలం 16 సంవత్సరాల బాలిక అని అయితే ప్రతి బాలిక విద్యను అభ్యసించాలని, చిన్నప్పటికీ నుంచే ఆసక్తిగల వ్యక్తి అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ గుంట తులసీరావు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో యువతను బృందాలుగా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ చక్కగా సరిపోతుందన్నారు. విశ్వవిద్యాలయంలో 1100 మంది ఉన్నారని అందులో గరిష్టంగా రెడ్‌క్రాస్‌లో చేరుటకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా 120 కళాశాలలు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయని అందులోని విద్యార్థులు కూడా చేరుటకు ప్రయత్నిస్తామన్నారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర కన్వీనర్, అదాయపన్ను శాఖ విశ్రాంత కమిషనర్ యు. ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా శాఖ నుంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ రాష్టస్థ్రాయి కార్యక్రమం శ్రీకాకుళం పట్టణంలో చేపట్టుటకు ప్రయత్నిస్తున్నామన్నారు.
జూనియర్ రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు, భువనేశ్వర్‌లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొనివచ్చిన గార జడ్పీ పాఠశాల విద్యార్థి సూర్యనారాయణ, ఎం. దివ్యలు శిక్షణా కాలంలో నేర్చుకున్న విషయాలను, వివరించారు. డి ఎస్పీ కె.మోహనరావు, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిఎంహెచ్‌ఒ శ్యామల, ఉప విద్యాశాఖాధికారి బి.సుబ్బారావు, రిమ్స్ పర్యవేక్షకులు డాక్టర్ సునీల్‌నాయక్, రెడ్‌క్రాస్ సభ్యులు బలివాడ మల్లేశ్వరరావు, గీతాశ్రీకాంత్, యోగారామారావు, బండారు చిట్టిబాబు, నిక్కు అప్పన్న, కె.సోమేశ్వరరావు, లక్మునాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీకి రెండ్రోజుల ఆదాయం రూ. అర కోటి
శ్రీకాకుళం(టౌన్), జనవరి 19: జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో ఆర్టీసీ సంక్రాంతి పండుగ రెండ్రోజులు అధిక ఆదాయాన్ని మూటగట్టుకుంది. సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన జిల్లా వాసుల తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 17, 18 తేదీల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో సుమారు 117 బస్సులు అదనంగా నడుపగా 42 లక్షల రూపాయల అధిక ఆదాయం ఆర్జించింది. 17వ తేదీన మొత్తం 47 లక్షల రూపాయలు, 18వ తేదీన 74 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. అయితే సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం 40 లక్షల రూపాయల వరకు వస్తుండగా మిగిలిన 42 లక్షల రూపాయలు సంక్రాంతి పండుగ సందర్భంగా అధికంగా వచ్చినట్లైంది. ఇది డివిజన్ పరిధిలో 97 శాతం ఓఆర్ సాధించినట్లు లెక్క. ఆర్టీసీలో సుమారు 97 శాతం ఓఆర్ సాధించడం రికార్డు కాగా డిపోల వారీగా 18న ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటో డిపో 16 లక్షల రూపాయలు, రెండో డిపో 18.76 లక్షల రూపాయలు, పలాస డిపో 13.27 లక్షల రూపాయలు, పాలకొండ డిపో 17.26 లక్షల రూపాయలు, టెక్కలి డిపో 10.59 లక్ష సాధించాయి.

పల్స్ పోలియో
విజయవంతం
పోలాకి, జనవరి 19: మండలంలోని గుప్పిడిపేట పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. మంగళవారం పల్లిపేట, అంప్లాం, గుప్పిడిపేట, దండులక్ష్మీపురం గ్రామాల్లో మూడవ రోజు ఇంటింటా వేసిన పోలియో మాఫింగ్‌ను పరిశీలించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోనివారందరూ వేశారా లేదా అనేది గ్రామాల్లో పరిశీలించి తెలుసుకున్నారు. పోలియో వ్యాధి రాకుండా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆమెతోపాటు వైద్యాధికారులు బలగ మురళీ, శిమ్మ ఇందుసింహా, ఎం పి హెచ్ సి ఇవో రవికుమార్, పిహెచ్ ఎన్ పద్మావతి, సూపర్‌వైజర్లు పి.మోహనరావు, అరవిందకుమారి, పద్మావతి, ఎఎన్ ఎం లు పాల్గొన్నారు.

ఎన్‌జిఒ సంఘ ఎన్నికలకు
రంగం సిద్ధం
పొందూరు, జనవరి 19: నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం పొందూరు పాలక యూనిట్‌కు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైందని ఎన్నికల అధికారి డి.అప్పలనాయుడు, సహాయాధికారి సత్యన్నారాయణ ఎన్ జివో సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఈశ్వరరావులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 27న నామినేషన్లు స్వీకరిస్తామని, 28న నామినేషన్ల ఉపసంహరణ నిర్వహిస్తామని ఎన్నికల వచ్చే 3న తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ఆయన వివరించారు. పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలకు సంబంధించిన ఎన్జీవో సంఘ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని వారు వివరించారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.
రథసప్తమికి పక్కా ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 19: ఎప్పుడూ సామాజిక దృక్పథంతో విధులు నిర్వర్తించమంటూ సూచనలు ఇచ్చే కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తిరుమలతిరుపతి దేవస్థానం (తితిదే)లో వృద్ధులు, చిన్నపిల్లల మహిళలు, వికలాంగులను ప్రత్యేక క్యూలైన్లలో ఏ విధంగా స్వామివారి దర్శనం చేసేందుకు అవకాశం కల్పించారో..అదే రీతిలో సూర్యజయంతి వేడుకల్లో ఆదిత్యుని దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు తప్పనిసరి అంటూ కలెక్టర్ హుకుం జారీ చేసారు. ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో ఆరోగ్యప్రధాతకు క్షీరాభిషేకం చేయించదలచిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మూడు కౌంటర్ల ద్వారా ఆ టిక్కెట్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూలైన్లు మంచి ప్రణాళికతో నిర్మించాలని, వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా శీఘ్రగతిన దర్శనం జరిగేలా ఉండాలన్నారు. వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చే మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా పంపించే ఏర్పాట్లు ఈసారి తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పుష్కరిణి వద్ద స్థానాలు ఆచరించే భక్తులకు తగిన జాగ్రత్తలు చేట్టాలని అన్నారు. వచ్చే వాహనాలు క్రమ పద్దతిలో పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల సదుపాయం ఉండాలని, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉచిత భోజన ప్రసాద కార్యక్రమాన్ని రథసప్తమి రోజున పర్యాటక హోటల్ (బడ్జెట్ హోటల్) వద్ద ఏర్పాటు చేయాలన్నారు. కనీసం నాలుగు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఈ ఉచిత వైద్య శిబిరం 13వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల వరకూ కొనసాగాలని సూచించారు. రెండు 108 వాహనాలను సిద్ధంగా ఉంలని, విద్యుత్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. రహదారులలో గుంతలు లేకుండా చూడాలని, విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం తాగునీటి ఏర్పాట్లును చేపట్టాలని శ్రీకాకుళం నగరపాలకసంస్థ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంలో ఎక్కడా లోపం ఉండకుండా చూడాలన్నారు. పుష్కరిణిలో ప్రస్తుతం ఉన్న నీటిని తొలగించి కొత్తగా నీటిని ఫిబ్రవరి 12వ తేదీలోగా నింపాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే పుష్కరిణి వద్దకు వచ్చే కాలువ నగరంలోకి విశాఖ-ఏ కాలనీన గుండా ప్రవహిస్తుందని, అక్కడ కాలువలో మురుగునీరు కలుస్తున్న కారణంగా కాలువను రెండుమూడు కిలోమీటర్లు మేరకు శుభ్రపరచాల్సిన అవసరం ఉందని తోటపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు డోల తిరుమలరావు తెలియజేయగా వెంటనే దస్త్రాలను సమర్పించాలని దానిని నీరు చెట్టు కార్యక్రమం కింద చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. వేడుకలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం పెడుతున్నట్లు చెప్పారు. 14వ తేదీన మద్యంను నిషేధిస్తూ డ్రైడేగా ప్రకటించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరసవల్లి జంక్షన్ వరకు కనీసం 25 బస్సులను నడుపుటకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఉచిత ఆహారపానీయాలు అందించే వారు ముందుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, ప్రధాన అర్చకుల వద్ద పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు ఏ ఆహార పదార్థాలు అందిస్తున్నది తెలియజేయాలని, తద్వారా ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో అంచనావేస్తామని చెప్పారు.
క్షీరాభిషేకం టిక్కెట్లు, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బొంపాడ వీధి రామమందిరం, ఆలయ ఆర్చ్, ఆయల ఉత్సవ ద్వారం వద్ద విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సాలూరు వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీ అర్థరాత్రి నుంచి 14వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ క్షీరాభిషేకం టిక్కెట్లు విక్రయిస్తామన్నారు. రెండు వేల క్షీరాభిషేకం టిక్కెట్లు విక్రయించుటకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 14వ తేదీ ఉదయం ఆరు గంటల తర్వాత ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అదే కౌంటర్లో లభిస్తాయని చెప్పారు. క్షీరాభిషేకం టికెట్ ధర 216 రూపాయలుకాగా, ప్రత్యేక దర్శనం ధర 100 రూపాయలు అన్నారు. 20 మంది గజఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డోనర్లకు ప్రత్యేక పాస్‌లు అందిస్తామన్నారు. క్యూలైన్ల వద్ద పర్యవేక్షణకు, ఆహారపానీయాలు సరఫరా చేయుటకు వివిధ సంస్థలు మందుకు వస్తున్నాయని చెప్పారు. నాలుగు క్యూలైన్లుగా డోనర్లు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో వచ్చే మహిళలకు, వి.ఐ.పి.లకు, పోలీస్, న్యాయశాఖ, రెవెన్యూ సిబ్బంది, విధులు నిర్వహించే సిబ్బందికి, ప్రత్యేక దర్శనంకు వచ్చే భక్తులకు మొత్తం నాలుగు క్యూలైన్లు, అరసవల్లి మిల్ జంక్షన్ వద్ద కార్‌పార్కింగ్, డి.సి.ఎం.ఎస్.మిల్లు పక్కగల మామిడితోటలో టూవీలర్స్, గార వైపు వచ్చు వాహనాలకు హెచ్.ప.గొడౌన్‌తో సహా పోలీసుశాఖ గుర్తించే ఇతర ప్రదేశాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దర్శన అనంతరం బయటకు వెళ్ళే మార్గాలుగా బ్రహ్మణవీధి గుండా కళింగరోడ్డుకు, ఖాజీపేట గుండా కలెక్టరేట్ వైపుకు వెళ్ళుటకు, ఇంద్రపుష్కరిణీ వెనుకవైపుదారి గుండా అసిరితల్లి అమ్మవారి గుడివైపుగా వెళ్ళుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

టిడిపిలో ‘శాండ్ మైనింగ్’ తుపాను!
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
పుష్కర కాలం క్రితం అప్పటి టిడీపీ బిగ్‌బాస్ కింజరాపు ఎర్రన్నాయుడుపై తిరుగుబాటు చేసిన గుండ అప్పలసూర్యనారాయణ...2012 వరకూ బీచ్‌శాండ్ మైనింగ్‌లో అవకతవకలను నిలదీస్తూనే ప్రజాభిప్రాయసేకరణకు గుండ లేఖ కూడా ఇవ్వని పరిస్థితి. అప్పట్లో అన్నీ పార్టీల నేతలు ఎన్‌ఒసిలు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ అదే ఫార్ములాతో గుండ కుటుంబీకులు అడుగులు వేస్తున్నారు. కొంతమంది జిల్లా టిడిపి నేతలపై ఇతర జిల్లాలకు చెందిన కొంతమంది పార్టీ నేతలు సిక్కోల్ తీరంలో 163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో శాండ్‌మైనింగ్ చేసేందుకు దరఖాస్తులు చేసే సంస్థలకు పరోక్షంగా బలపరుస్తామంటూ కొంతమంది ఎమ్మెల్యేలు పవర్ ప్రయోగిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం కల్పించే తీరంలో ఖనిజ సంపదకు సంబంధించి స్థానిక నేతలతో అనధికార ఒప్పందాలు కుదుర్చుకోకపోతే చేసిన ధరఖాస్తులను మోకాలడ్డే వాతావరణం ప్రజాప్రతినిధుల్లో నెలకొందనవచ్చు. అందుకే బీచ్‌శాండ్ మైనింగ్ పరిశ్రమలో ఆరితేరిన పారిశ్రామికవేత్తలు సైతం సిక్కోల్ పసుపుదళం అనుమతులు ముందుగా తీసుకునే దరఖాస్తులు చేసుకోవల్సిన పరిస్థితి ఉందనవచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి చిన్నపాటి ఆంక్షలు అధిగమించేస్తామనుకునేవారి పట్ల ఆయా ఎమ్మెల్యేలు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడుతున్నట్లు కన్పిస్తోంది. ఇందుకు తార్కణమే భావనపాడు బ్లాక్ వజ్రపుకొత్తూరు మండలం కావడం, పలాస నియోజకవర్గం పరిధి కావడంతో శాండ్‌మైనింగ్ పట్ల అక్కడి ఎమ్మెల్యే, సాక్షాత్తు స్థానిక మంత్రినే వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాగావళి తీరంలో బొంతలకోడూరు వద్ద శాండ్‌మైనింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని అడ్డుకునేందుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే, టిడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా జిల్లా మంత్రి ప్రోత్సాహంతో దరఖాస్తులు చేసారన్న అనుమానాలతో బొంతలకోడూరులో శాండ్‌మైనింగ్‌కు అనుమతులు ఇవ్వరాదంటూ అధికారులకు వౌఖికంగా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తొగరాం, దూసి, పెనుబర్తి ప్రాంతాల్లో తీరంలో ఖనిజ సంపద వెలికితీసేందుకు దరఖాస్తులు చేసేవారి వివరాలు సేకరించిన ప్రభుత్వ విప్ సైతం ఆ ప్రాంతాల్లో శాండ్ మైనింగ్‌కు అనుమతులు తన ప్రమేయం లేకుండా ఇవ్వరాదంటూ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేసినట్లు భోగట్టా. ఇలా..తీరం అంతటా తొమ్మిది సంస్థలు 38 దరఖాస్తులు చేసుకుని, సుమారు 17 వేల హెక్టార్లలో శాండ్‌మైనింగ్ చేసేందుకు అనుమతులు కోరగా, అన్నీ దరఖాస్తులపై రాజకీయ నేతల ప్రచ్చన్నయుద్ధం ఆరంభమైంది. గతంలో ఎర్రన్న - గుండల మధ్య రేగిన శాండ్‌మైనింగ్ యుద్ధం ఇప్పుడు పునరావృతం అయ్యిందనవచ్చు. ఒక మాజీ మంత్రి, ఒక తాజా మంత్రి అండదండలతో గత కొనే్నళ్ళుగా కొన్ని సంస్థలు బీచ్‌శాండ్‌మైనింగ్ చేస్తూనేవున్నాయి. ప్రభుత్వాలు మారినా, మంత్రులను ఆశ్రయించి వారి పనులు చేయించుకోవడం ఆ సంస్థల యాజమాన్యాలకు తెలిసిన విద్యే! కాని - స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆయన భర్త మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణలను దూరంగాపెట్టి ప్రస్తుతం నడుస్తున్న బీచ్‌శాండ్‌మైనింగ్‌వల్ల సిక్కోల్ తీరంలో రాజకీయ తుపాను రేగుతోంది. గతంలో మంత్రి, ఎమ్మెల్యే ధర్మానే కావడంతో ఆ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు మంత్రితో సంప్రదింపులు చేస్తూ లోకల్ ఎమ్మెల్యేను విస్మరిస్తున్నారన్న సెగలు మాత్రం ట్రైమెక్స్ సంస్థను దహిస్తున్నాయనడంలో అసత్యంలేదు. గుండ వర్గీయులు 3లోకల్2 అన్న ఫార్ములాను తెరపైకి తెచ్చి ‘లక్ష్మీ’ని ప్రసన్నం చేసుకోకపోతే మైనింగ్ అడ్డుకుంటామని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం తరుఫున ఏపీఎండీసీ లిమిటెడ్ ఆరు దరఖాస్తులు చేసుకుని నాలుగు వేల హెక్టార్లలో శాండ్‌మైనింగ్ చేయాలన్న ఆలోచనకు తూట్లుపెట్టి మాజీ మంత్రి ధర్మాన బంధువు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బంధువు, వైకాపా నేతలకు సంబంధించిన సంస్థల దరఖాస్తులు ప్రస్తుతం గనులుశాఖ పరిశీలనలో ఉన్నట్టు భోగట్టా. వీటికిమించి మిగిలిన దరఖాస్తులు ఏవీ స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తే సహించేది లేదంటూ ఇప్పటికే మంత్రి అచ్చెన్నతో వీరంతా ప్రచ్ఛన్న యుద్ధానికి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రితో లోకల్ ఎమ్మెల్యేలు ప్రచ్చన్న యుద్ధానికి సిద్ధమవుతున్నారంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట! ఏదిఏమైనప్పటికీ, తీరంలో టిడిపి తుపాను టీకప్పులో కాదని, సముద్రంలో సునామీగా మారే ప్రమాదం ఉందన్న విషయాన్ని పార్టీ అధినేత గ్రహించి..సిక్కోల్ నేతల మధ్య సమన్వయం కుదిరిస్తేనే...జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఉండే ఛాన్స్ ఉంటోందని రాజకీయ విశే్లషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను స్వాగతించినట్లు అవుతుంది!

రిమ్స్‌లో రూ. 5 లక్షలతో
డంపింగ్ యార్డు ప్రారంభం
శ్రీకాకుళం(టౌన్), జనవరి 19: జిల్లా కేంద్రానికే తలమానికంగా నిలిచిన రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(రిమ్స్)లో సుమారు ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డును రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎల్.ఎన్.ప్రసాద్ ప్రారంభించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డంపింగ్ యార్డుతో పాటు బయో మెడికల్ వేస్ట్ స్టాక్ రూంను వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎ.కృష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ వైద్య కళాశాలలో డంపింగ్ యార్డు నిర్మాణం ఉత్తరాంధ్రలోనే మొదటిదన్నారు. రాష్ట్ర ఆసుపత్రులు వౌళిక సదుపాయాల సంస్థ ద్వారా జిల్లాలోని టెక్కలి, రాజాం, పాలకొండ ఆసుపత్రుల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో మిగులును ఈ విధంగా వినియోగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఆయనతో పాటు కార్యక్రమంలో సియస్ ఆర్‌యంవో డాక్టర్ బి.అప్పలనాయుడు, ఎపియస్‌యంహెచ్‌ఐడిసి ఈఈ రాంబాబు, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.