కర్నూల్

రేషన్‌కార్డుల కోసం 6 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 9 : రేషన్‌కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అలాగే చౌకదుకాణాల డీలర్లు పార్టీలకు అతీతంగా పని చేయాలని, అవకతవకలకు పాల్పడితే వేటు తప్పదన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, రేషన్‌కార్డుదారులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం మంత్రి సునీత పౌర సరఫరాల శాఖ పనితీరుపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, సివిల్ సప్లైస్ డిఎం ఎస్.కృష్ణారెడ్డి, డిఎస్‌ఓ తిప్పేనాయక్, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మం త్రి సునీత మాట్లాడుతూ ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ చౌక దుకాణాలను తెరచి ఉంచి రేషన్‌కార్డుదారులందరికీ నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చౌక దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం 59 వేల దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి అర్హత మేరకు కార్డుల జారీకి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 14 మండలాల్లోని 42 చెంచు గూడెంలలోని వారికి ఎఎవై కార్డులు జారీ చేస్తామన్నారు. వికలాంగులు, వృద్ధులు, లెప్రసీ వ్యాధిగ్రస్థులు, చౌకదుకాణానికి రాలేని వారిని గుర్తించి వారి కోసం ‘మీ ఇంటికి-మీ రేషన్’ కార్యక్రమాన్ని రూపొందించి అనంతపురం జిల్లాలో ప్రారంభించామన్నారు. కర్నూలు జిల్లాలో కూడా సర్వే చేయించి 5,663 మందిని గుర్తించామని వారందరికీ ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ షాపు డీలర్ల ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా జెసి హరికిరణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,414 రేషన్ షాపుల ద్వారా 11.10 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. పంపిణీలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 25 మంది కిరోసిన్ డీలర్లు, 60 గ్యాస్ ఏజెన్సీలు, 210 పెట్రోలు బంకులు ఉన్నాయని, వాటిపై రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలనే అంశంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించామని జెసి మంత్రికి వివరించారు.