కర్నూల్

శ్రీశైల నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మే 9: శ్రీశైల నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని, అలాగే తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఐఎఎస్ అధికారిని నియమిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. గోపవరం గ్రామంలో రూ. 2 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులకు సోమవారం శిల్పా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉపా ధి కూలీలు పనులు కల్పించాలని ఏకశిల్పాను కోరారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కావాల్సినన్ని నిధులు ఇచ్చారని, మహానంది మండలంలో రూ.9 కోట్లతో పలు అభివృద్ధి పనులను ఆయా గ్రామాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో గోపవరం నుంచి గాజులపల్లె ఆర్‌ఎస్ మీదుగా రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టామని, దీనికి భూమి పూజచేసినట్లు తెలిపారు. తిమ్మాపురం దారికి రూ.2 కోట్లు, నందిపల్లె నుంచి తమడపల్లె వరకు రూ.కోటితో, మసీదుపురం నుంచి సీతారామాపురంకు రూ.2 కోట్లతో దారులు నిర్మిస్తున్నామన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, బయట బిటి రోడ్డు వేయిస్తున్నామన్నారు. పుష్కర ఏర్పాట్లలో భాగంగా వెలుగోడు, కృష్ణనంది, ఓంకారం, మహానంది సమీపంలోని తెలుగుగంగ కాల్వ వద్ద పుష్కర ఘాట్లు అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంది విగ్రహం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే గార్డెనింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి అక్కడే డబుల్ బెడ్‌రూములు నిర్మించి వారికి కేటాయిస్తామన్నారు. కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు ఆయనతోపాటు ఎమ్మెల్సీలు శమంతకమని, శ్రీనివాసులు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో కూడిన కమిటీ ఈ నెల 16 నుంచి మండలంలో పర్యటిస్తుందన్నారు. నివేదికలు తయారు చేసి సిఎంకు అందించడం జరుగుతుందన్నారు. ఓంకారంలో అటవీ భూమిని 25 ఎకరాలు తీసుకొని దేవస్థానంకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ భాస్కర్‌రెడ్డి, ఎంపిపి చింతం నాగమణి, మహానంది చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, టిడిపి నాయకులు శిల్పాభువనేశ్వర్‌రెడ్డి, సిహెచ్ రాముడు, క్రాంతి కుమార్, రమేష్, మండల అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, సుబ్బరాయుడు, చంద్రారెడ్డి, వివేకానంద రెడ్డి, ధర్మకర్తలు చంద్రవౌళీశ్వర్‌రెడ్డి, బాలరాజు, ఈశ్వరయ్య, చంద్రయ్య తదితర తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రాఘవేంద్రుని బృందావనానికి
గంద లేపన మహోత్సవం
మంత్రాలయం, మే 9: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి గంద లేపన మహోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం అక్షయ తృతి పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. లోక కల్యాణార్థం అవతరించిన పరమ పావన మూర్తి శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన నిజ బృందావనం (మూలబృందావనం) వేసవి కాలంలో ఉండే ఎండవేడిమి తగలకుండా చల్లగా ఉండేందుకు ప్రతి అక్షయ తృతీయ దినమున గంద లేపనం చేస్తారు. స్వామి మూల బృందావనంతో పాటు మఠంలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహానికి, ఇతర బృందావనాలకు కూడా గంద లేపనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, దార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.