క్రీడాభూమి

ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీఅగ్రస్థానానికి కోల్‌కతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 22: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆది వారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను 4-0 తేడాతో ఓడించిన డిఫెండింగ్ చాంపి యన్ అట్లెటికో డి కోల్‌కతా నంబర్ వన్ స్థానాని కి దూసుకెళ్లింది. సమీగ్ దౌతీ రెండు గోల్స్ చేసి కోల్‌కతా విజయంలో కీలక భూమిక పోషించా డు. బొర్జా ఫెర్నెండెజ్, ఇయాన్ హ్యూమ్ చెరొక గోల్ సాధించారు. సా ల్ట్‌లేక్ స్టేడియంలో జ రిగిన ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు సుమారు 50,000 మంది అభిమాను లు హాజరయ్యారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే కోల్‌కతా అద్భుత ప్రతిభ కనబరచింది. 20వ నిమిషంలో దౌతీ చేసిన గోల్‌తో కోల్‌కతా ఖాతా మొదలైం ది. మరో రెండు నిమిషాల్లోనే ఫెర్నాండెజ్ చేసిన గోల్‌తో 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన కోల్‌కతా ఆతర్వాత రక్షణా త్మక విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవ కాశం ఇవ్వకుండా అడ్డుకుంది. దీనితో ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ఆరంభలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించిన కోల్‌కతా ఆ తర్వాత జోరు పెం చింది. ఒకవైపు గోవా ఆటగాళ్లను నియంత్రీకరిస్తూనే మరో వైపు గోల్స్ కోసం దాడులు ఆరంభించింది. 68వ నిమిషం లో హ్యూమ్ ద్వారా కోల్‌కతాకు మూడో గోల్ లభించింది. దౌతీ 78వ నిమిషంలో గోల్ సాధించాడు. తిరుగులేని ఆధి క్యాన్ని కనబరచిన కోల్‌కతా ఈ విజయంతో మొత్తం 20 పాయంట్లతో అగ్రస్థానికి చేరుకోగా, గోవా, ఢిల్లీ డైనమోస్ చెరి 18 పాయంట్లతో సమంగా ఉన్నాయ. అయతే, ప్ర త్యరి కి తక్కువ గోల్స్ ఇచ్చిన గోవాకు రెండో స్థానం దక్కింది.