కర్నూల్

పకడ్బందీగా పది పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, మార్చి 17: నంద్యా ల డివిజన్‌లో ఈనెల 21వ తేదీ నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ డిఇఓ తాహెరా సుల్తానా తెలిపారు. బుధవారం పట్టణంలోని డిప్యూటీ డిఇఓ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలోని 14 డివిజన్‌లలో రెగ్యులర్‌గా 12,848 మంది విద్యార్థులు, ప్రైవేట్‌గా 541 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. 703 మంది ఇన్విజిలేటర్లు, 61 మంది చీఫ్‌లను, డిపార్ట్‌మెంటల్ అధికారులను 61 మందిని నియమించినట్లు చెప్పారు. మొత్తం 56 కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు, 5 కేంద్రాలను ప్రైవేట్ విద్యార్థులకు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాలలో బల్లలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బల్లలు లేనిచోట ప్రభుత్వం బల్లలను కేటాయించిందన్నారు. విద్యార్థులు ఉదయం పరీక్షా సమయం కంటే అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. అలాగే ప్యాడ్ తెచ్చుకోవాలని, ఒక్కొక్క కేంద్రంలో నీటివసతి, లైటింగ్, ఎఎన్‌ఎంను నియమించినట్లు చెప్పారు.