కృష్ణ

ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 6: ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సోమవారం ఎన్టీఆర్ పరిపాలనా భవనం సిటీబస్ పోర్ట్, వైస్క్రీన్స్‌లను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలకు తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యుత్తమ పద్ధతుల ద్వారా ప్రయాణికులకు సేవలందించడం ప్రశంసనీయమన్నారు. బస్‌స్టేషన్లను ఎయిర్‌పోర్ట్‌ల మాదిరిగా ఆధునీకరించడం మంచి పరిణామమన్నారు. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని కోరారు. బస్‌లో జిపిఎస్ పద్ధతిని తీసుకురావటం జరిగిందని, దీనిద్వారా సమయపాలన పాటిస్తూ బస్సులు సరైన సమయంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. కొద్దిపాటి సంస్కరణలతో ఆర్టీసీ బస్‌ల ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. పేదలకు ఆర్టీసీ బస్సు ప్రధాన రవాణా సౌకర్యమని పేర్కొన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలను ఆర్టీసీ అమలుచేస్తుందని, కార్గో రవాణాకు శ్రీకారం చుట్టి నెల రోజుల వ్యవధిలో రెండుకోట్ల ఆదాయం ఆర్జించిందన్నారు. ఈకామర్స్ విధానంలో ఆర్టీసీ ఆన్‌లైన్ బిజినెస్‌లో కూడా ప్రవేశించాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ఆర్టీసీ బస్ స్టేషన్లకు ప్రభుత్వ స్థలాలను కేటాయించామని, తద్వారా బస్ స్టేషన్లతో పాటు ఆర్టీసీ సంస్థకు స్థిరాస్తులు సమకూరాయన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టిక్కెట్లను ప్రయాణికులు కావాల్సిన ప్రాంతాలకు ఎక్కడి నుంచైనా టిక్కెట్ తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. రైల్వే మాదిరిగా అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం, టిక్కెట్ రద్దుచేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, దీనిద్వారా ప్రభుత్వానికి రూ.650 కోట్లు అదనంగా భారం పడిందన్నారు. బస్ స్టేషన్ల నిర్మాణంలో ఆర్థిక సహాయం చేసే దాతల పేర్లు ఆయా స్టేషన్లపై ఉంచేందుకు అభ్యంతరం లేదని నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పేర్లు ఉంచబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రానున్న కాలంలో సిఎన్‌జి బస్సులతో పాటు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఆర్టీసీ ఎండి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ భవనాల డిజైనర్ పాండురంగారావుకు సిఎం అభినందనలు
ఆర్టీసీ భవనాల డిజైనర్ విఆర్ సిద్ధార్థ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.పాండురంగారావును ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు. ఆర్టీసీ భవనాలను ఎరైవల్ బ్లాక్ ఆరు అంతస్తులుగా నిర్మించుకునే విధంగా ముందు భాగాన్ని మూడు అంతస్తులు నిర్మించుకునే విధంగా డిజైన్ చేయడం జరిగిందని పాండురంగారావు తెలిపారు. 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాలను 9 నెలల కాలంలో నిర్మిస్తామన్నారు. అంతకుముందు గుడివాడ డివిజన్‌కు చెందిన ఆర్టీసీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ప్రమాదవశాత్తూ మరణించినందున పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కింద శ్రీనివాసరావు భార్య నాగపుష్పావతికి రూ.10 లక్షల ప్రమాద బీమా చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు 7కోట్ల 36 లక్షల రూపాయలు రాజధాని నిర్మాణానికి తమ వంతుగా చంద్రబాబునాయుడు అందజేశారు.

హోంగార్డుపై దౌర్జన్యం కేసులో గుండారపు అరెస్ట్
పాతబస్తీ, జూన్ 6: దుర్గగుడి ఘాట్ రోడ్ సమీపంలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుపై దౌర్జన్యం చేసిన కేసులో నగరపాలక సంస్థలో ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబును వన్‌టౌన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై సిఐ పోలాకి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన విలేఖర్లకు తెలిపిన వివరాల ప్రకారం పాగాపు నాగరాజు అనే హోంగార్డు రామకృష్ణ అనే పోలీసు కానిస్టేబుల్ సోమవారం దుర్గాఘాట్ రోడ్డు సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో హరిబాబు తన స్నేహితుడు పిట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి వన్‌టౌన్ నుంచి భవానీపురం వైపు వెళుతుండగా హోంగార్డు అడ్డగించాడు. ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలుగుతుందని ఆ ప్రాంతంలో రాకపోకలు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ పోలీసులకు సమాచారమందించారు. ఆ మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అలాగే వన్‌టౌన్ పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ ప్రయాణికుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. తాను ఫ్లోర్‌లీడర్‌నని తనను వెళ్లనీయమని హరిబాబు కోరినా పోలీసులు, హోంగార్డు ససేమిరా అన్నారు. పైగా వారి మధ్య జరిగిన వాగ్వాదంలో అక్షరం ముక్కరాని వ్యక్తులు కార్పొరేటర్‌లు అయితే ఇలానే ఉంటుందని హోంగార్డు నోరు జారాడని ఆగ్రహించిన హరిబాబు అతనిపై దౌర్జన్యం చేశారు. బయటకు కనిపించని కౌకు దెబ్బలు తగిలిన హోంగార్డు ఈ సంఘటనతో భీతిల్లాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న వన్‌టౌన్ ఎస్‌ఐ, కూతవేటు దూరంలో ఉన్న సిఐ వెంకటేశ్వర్లు అప్రమత్తమై సంఘటన స్థలానికి పరుగులు తీసి హరిబాబును, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 332, 34ల ప్రకారం నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.