కృష్ణ

33వేల మందితో కృష్ణా పుష్కరాలకు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 6: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కృష్ణా పుష్కరాలకు పోలీసుశాఖ అసాధారణ భద్రత ఏర్పాట్లు చేపడుతోంది. దీనిలో భాగంగా 33వేల మంది అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులకు వినియోగించనుంది. ఇందుకోసం పొరుగురాష్ట్రాల నుంచి అదనపు బలగాలు రప్పించడంతోపాటు, కేంద్ర బలగాల కోసం హోంశాఖకు విఙ్ఞప్తి చేస్తోంది. పూర్తిగా సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకుంటూ నిఘా కోసం 1400 సిసి కెమేరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసు చీఫ్ డిజిపి జాస్తి వెంకట రాముడు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు 24వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేయగా, కృష్ణా పుష్కరాలకు ఈ సంఖ్య పెరుగుతోందన్నారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూనే అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా కట్టుదిట్ట ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కర్నాటక, తమిళనాడు, ఒడిస్సా, చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించడంతోపాటు, కేంద్ర బలగాల కోసం కేంద్ర హోంశాఖను కోరినట్లు చెప్పారు. సాంకేతికతను ఉపయోగిస్తూ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. పార్కింగ్ సౌకర్యాలు, సమాచార, సహాయక కేంద్రాల ఏర్పాటు, పుష్కర ఘాట్‌ల వద్ద ఇనుప కంచెల ఏర్పాటు, త్వరితగతిన స్పందించే బృందాలు, వాచ్ టవర్లు ఏర్పాటు, పికెట్లు, అవుట్‌పోస్టుల ఏర్పాటుకు సంబంధించి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా చోరీల నివారణకు ప్రత్యేక చర్యలకు డిజిపి ఆదేశించారు. రవాణా సంస్థలైన రైల్వే, ఆర్టీసి, ఆర్ అండ్ బి, దేవాదాయ శాఖలతో కలిసి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ తొక్కిసలాటకు తావు లేకుండా భద్రత చేపడుతున్నామన్నారు.
* పటిష్ఠ నిఘా
ఇక నిఘాకు సంబంధించి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమైన ఘాట్‌లు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా పర్యవేక్షణకు 1400సిసి కెమేరాలను వినియోగంలోకి తీస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలకు 458 సిసి కెమేరాలను వినియోగించారు. అన్ని కెమేరాలను ఉప కంట్రోల్ కేంద్రాల ద్వారా ప్రధాన కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి ఐపి ఆధారిత సమాచార కేంద్రాల ఏర్పాటు, బందోబస్తు, లైవ్ ట్రాకింగ్ కోసం మొబైల్ అప్లికేషన్లు, ఈ-బీట్, పెట్రోలింగ్ సౌకర్యం, సామాజిక మాధ్యమాలను వినియోగంలోకి తీసుకోవడం వంటి చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
* మొక్కలు - ఇంకుడుగుంతలకు ప్రత్యేక ఆదేశాలు
ఇదిలావుండగా... రాష్టవ్య్రాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఇంకుడు గుంటల ఏర్పాటుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు డిజిపి చెప్పారు. దీనిలో భాగంగా నగర పోలీసు కమిషనరేట్‌లోని ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఆదేశాలు యుద్ధప్రతిపదికన అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. డిజిపి ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో వెయ్యికి తక్కువ కాకుండా మొక్కలు నాటాల్సి ఉంది. అదేవిధంగా ప్రతి పోలీస్టేషన్, పోలీసు కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. వెంటనే అమలు చేయాలని ఆదేశించినట్లు డిజిపి చెప్పారు. విలేఖరుల సమావేశంలో పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, శాంతి భద్రతల అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్, ఐజి హరీష్ గుప్తా, విశ్వజిత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిఎంతో డిజిపి రాముడు బేటీ
విజయవాడ (క్రైం), జూన్ 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో రాష్ట్ర పోలీసు చీఫ్ డిజిపి జెవి రాముడు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన డిజిపి సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐపిఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా నవ నిర్మాణ దీక్షల ముగింపునకు సంబంధించి నిర్వహించ ఈనెల 8న నిర్వహించతలపెట్టిన మహాసంకల్పం సభకు సంబంధించి కూడా చర్చించారు. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్న పోలీసుశాఖ పటిష్ఠతకు పలు అంశాలను సీఎం దృష్టికి డిజిపి తీసుకెళ్లినట్లు తెలియవచ్చింది. రాష్టవ్య్రాప్తంగా పలు పోస్టుల్లో ఐపిఎస్ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీనికితోడు శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కల్పించే విషయంతోపాటు, మహాసంకల్పం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, బందోబస్తు, భద్రతపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఐపిఎస్ ఏపి క్యాడర్‌కు కేటాయింపు జరిగిన దరిమిలా శిక్షణ పొంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు రాష్ట్రంలో పోలీసుశాఖకు కావాల్సిన భవనాలు, వౌలిక వసతులు, రాజధాని పోలీసింగ్‌కు సంబంధించి అమరావతి కమిషనరేట్ తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

అట్టహాసంగా నూతన గురువుల పట్ట్భాషేక మెహోత్సవం
పటమట, జూన్ 7: గుణదలలోని బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌లో సో మవారం సాయంత్రం నూతన గురువుల పట్ట్భాషేక ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై విజయవాడ కతోలిక పీఠం మ.ఘ.మోస్ట్ రెవ. బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఇప్పటి వరకు డీకన్ బ్రదర్స్‌గా ఉన్నవారిని త్రి స్మాతెలంతో కతోలిక సంప్రదాయం ప్ర కారం నూతన గురువులుగా ప్రమా ణం చేయించి పట్ట్భాషిక్తులను చేశా రు. కృష్ణాజిల్లా విజయవాడ కతోలిక పీఠం పరిధిలోని దారం సతీష్, మద్దా ల వినయ్‌కుమార్, గోళ్ల సువర్ణరాజు, దామాల బాలఏసు, మద్దా ల వరప్రసాద్, దొడ్డ అనిల్‌కుమార్, చిలుకోటి జాన్‌బాబులను బిషప్ జోసఫ్ రాజారావుదాదాపు 2గంటల పాటు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక నుండి క్రీస్త్భుగవానుడు గురువులుగా (్ఫదర్స్‌గా) ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా బిషప్ జోసఫ్ రాజారావు దివ్య సందేశమిస్తూ క్రీస్తుప్రభువు మానవుడికి అనుగ్రహించిన గొప్పవరం గురుత్వ జీవితమన్నారు. ఎంతో అతి పవిత్రమైన, ఔనత్యంతో కూడిన గురు జీవితాన్ని నూతనంగా ఎన్నికైన గురువులు సేవా భావంతో, త్యాగపూరితమైన హృదయంతో భక్తులకు క్రీస్తు పరిచర్యను అందించాలని కోరారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు బిషప్ జోసఫ్ రాజారావు, ఛాన్సలర్ జె.జాన్‌రాజు, కోశాధికారి ఫాదర్ యం.గాబ్రియేలు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, డయోసిస్‌కు చెందిన వందలాది మంది గురువులు నూతన గురువులని తెల్లటి గురు వస్త్రాలతో ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు తొడ్కొని వచ్చారు. ఈ కార్యక్రమంలో బిషప్ గ్రాసి హైస్కూల్ కరస్పాడెంట్ ఫాదర్ జి.జ్వానీసు, రెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్ బాలశౌరిరెడ్డి, ఫాదర్ మల్లవల్లి బాలస్వామి తదితర డయోసిస్‌కు చెందిన గురువులు, సిస్టర్స్, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.