కృష్ణ

ఆగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 6: ఆగిరిపల్లి ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, కానిస్టేబుళ్ళపై తెలుగుతమ్ముళ్ళ దాడి సంఘటనతో ఆగిరిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దళితరత్న అవార్డు గ్రహీత, మంత్రి రావెల కిషోర్‌బాబు, దేశం నేత ముత్తంశెట్టి కృష్ణారావు అనుచరుడు పాలేటి మహేశ్వరరావు తో పాటు అతని అనుచరులు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌పై సోమవారం ఉదయం దాడి చేశారు. దాడిలో అడ్డుగా వచ్చిన కానిస్టేబుళ్ళలకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో ఆగిరిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన పాలేటి శ్రావణ్‌కుమార్, రొంపిచర్ల నాగేశ్వరరావు, ఎం జోజిబాబు, ఎం దుర్గారావు, గుండ్రపు వినోద్‌కుమార్, మహేశ్వరరావులు రౌడీషటర్లుగా పోలీసు రికార్డులలో నమోదై ఉన్నారు. వీరందరి పూర్తి వివరాలను పోలీసులు కంఫ్యూటరీకరణ చేస్తున్నారు. దీనిలో భాగంగా వారం రోజుల క్రితం వీరందరినీ పోలీసు స్టేషన్‌కు వచ్చి వివరాలు అందించాల్సిందిగా ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇప్పటి వరకు వీరు వివరాలు అందించలేదు. సోమవారం ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ స్థానిక పెద్ద కొటాయ్ సెంటరులో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు రౌడీ షీటర్లు అటువైపు మోటారు సైకిల్‌పై వెళుతున్నారు. వీరిని ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ పిలిచి వివరాల ఇచ్చేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుండగా, శ్రావణ్‌కుమార్ తన అన్న పాలేటి మహేశ్వరరావుకు ఈ సమాచారం అందించాడు. వెంటనే పాలేటి మహేశ్వరరావు వచ్చి ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌తో వాగ్వివాదానికి దిగాడు. ఎస్ ఐ పై మహేశ్వరరావు నానావిధంగా దుర్భాషలాడుతూ యూనిఫాం తీసి రా నీ సంగతి తేలుస్తా.. అంటూ పలు విధాలుగా దూషిస్తూ దాడి చేశాడు. వెంటనే అక్కడే ఉన్న కానిస్టేబుళ్ళు అడ్డుపడటంతో కానిస్టేబుళ్ళకు గాయాలు అయ్యాయి. జరిగిన సంఘటనపై పోలీసులు తేరుకునే లోపు రౌడీషీటర్లు పరారైనారు. వెంటనే ఎస్‌ఐ ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. సిఐ కెఎన్‌వి జయ కుమార్, డిఎస్‌పి కె శ్రీనివాసరావు, నార్త్‌జోన్ ఐజి కుమార విశ్వతేజలు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.
అఖిల పక్ష నాయకులు ఆందోళన
ఖాకీలపై తెలుగు తమ్ముళ్ళ దాడి నేపధ్యంలో మండలంలోని అఖిల పక్ష నాయకులు సోమవారం ఆగిరిపల్లిలో ఆందోళన చేశారు. పోలీసులపై దాడి చేసి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులుగా మారి గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తంశెట్టి కృష్ణారావులు పలు పర్యాయాలు మహేశ్వరరావు ఇంటికి వెళ్ళారని, దీంతో మహేశ్వరరావు వీరి అనుచరులుగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు చేస్తున్నారని చెప్పారు. వ్యాపారస్తులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహారిస్తున్నారని, వీరందరిపై పిడి యాక్డు కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ డిఎస్‌పి శ్రీనివాసరావుకు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలగాని వెంకటేశ్వరరావు, కొండా మంగయ్య, చౌటపల్లి అంజయ్య, పి శ్రీనివాసరావు, ఎలికే జమలయ్య, వైకాప నాయకులు కాజా రాంబాబు, పూరాకుల కొండలు, సింగవరపు వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు ఎం దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దోషులపై చర్యలు తప్పవు
ఎస్‌ఐ తో పాటు కానిస్టేబుళ్ళ పై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర కోస్తా ఐజి కుమార విశ్వజిత్ స్పష్టం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శాంతి బద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తామని, గ్రామంలో శాంతి బద్రతలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎఆర్ పోలీసుల ఆధీనంలోకి ఆగిరిపల్లి గ్రామం వెళ్ళింది. కాగా ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది.

అవనిగడ్డలో భారీ వర్షం
అవనిగడ్డ, జూన్ 6: గత అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయం కావటమే కాకుండా ప్రధాన రహదారిపై మోకాలి లోతు వర్షపునీరు నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణీకులు, వాహన చోదకులు ఇక్కట్ల పాలయ్యారు. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రధాన రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచి ఉంటున్నాయి. ప్రయాణీకులు, బాటసారులు, వాహన చోదకులు వర్షం నీటిలోనే ప్రయాణించక తప్పటం లేదు. డ్రైనేజిలలో మురుగునీరు పారుదల లేకపోవడం వల్లే వర్షం కురిసిన వర్షం నీరు రహదారిపై పెద్ద ఎత్తున వర్షపునీరు నిల్వ ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా దుకాణాలలోకి వర్షం నీరు ప్రవహించటంతో వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ఉద్యాన పంటలైన బీర, దోస పంటలు కూడా ముంపునకు గురై తీవ్ర నష్టం వాటిల్లింది.