కృష్ణ

సంకల్ప బలంతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 8: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంకల్ప బలంతో ముందుకు సాగుదామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో బందరు నియోజకవర్గ స్థాయి మహా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణతో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని గత రెండేళ్ళ ప్రభుత్వ పాలనను వివరించారు. విభజన నేపథ్యంలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించారన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించి పొరుగు రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేసే స్థితికి చేరుకున్నామన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం లక్షా 20వేలకు పెంచడానికి కృషి జరుగుతోందన్నారు. బందరు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పోర్టుతో పాటు ఈప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. ఇప్పటికే బందరు అభివృద్ధికి మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (మడ)ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మడకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. గత రెండేళ్ళల్లో బందరు నియోజకవర్గంలో రూ.630 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 20 వేల 176 మందికి రూ.50 కోట్లు పెన్షన్‌లుగా అందిస్తున్నామన్నారు. కొత్తగా మరో 3257 మందికి పెన్షన్లు మంజూరు చేశామన్నారు. మరో రూ.5కోట్లతో వెలుగు ద్వారా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కోటీ 30లక్షలు విలువ చేసే 6774 దీపం కనక్షన్‌లు మంజూరు చేశామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి తదితర కార్పొరేషన్‌ల ద్వారా రూ.7కోట్ల విలువైన యూనిట్లు, రుణాలు అందజేశామన్నారు. వ్యవసాయ రంగంలో రూ.17కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి రవీంద్ర వివరించారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ అశాస్ర్తియంగా జరిగిన విభజన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. సంకల్ప దీక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.