కృష్ణ

బాబుకు బాసటగా నిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 8: ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా, రాష్ట్రం 16వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో మైలవరం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మహా సంకల్ప దీక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయటానికి చంద్రబాబు కంకణం కట్టుకుని పని చేస్తున్నారని ఉమ చెప్పారు. ముఖ్యంగా జలవనరుల శాఖ ద్వారా ఇప్పటివరకూ దాదాపు 14వేల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. మరో 25 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులను సకాలంలో నిర్మించి రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 8.8 టీఎంసిలను కృష్ణానదికి మళ్ళించి కేవలం ఐదున్నర మాసాల్లో నదులను అనసంధానం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇదే స్ఫూర్తితో పోలవరం నుండి చింతలపూడి లిఫ్ట్ ద్వారా జల్లేరు లిఫ్ట్‌కు, అక్కడి నుండి ఎన్‌ఎస్‌పి ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటరు వద్దకు నీటిని మళ్ళించి మెట్టప్రాంతంలో రెండు పంటలు పండేలా ప్రణాళికలను అమలుచేసి జన్మధన్యం చేసుకుంటానని ప్రకటించారు. భూగర్భ జలాలను పెంపొందించటం కోసం దాదాపు 2,800 కోట్ల రూపాయలతో నీరు-చెట్టు పథకాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాబోయే రోజుల్లో సాగు, మంచినీటి ఇబ్బందులను రానీయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. తాజాగా అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు కోటీ 50 లక్షల మందికి చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఉమ వివరించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్ది 2029 నాటికి దేశంలోనే అగ్రగామిగా, 2050 నాటికి ప్రపంచంలోనే గుర్తింపు పొందే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఉమ కోరారు. అనంతరం కడపలో చంద్రబాబు మహా సంకల్ప దీక్ష సందర్భంగా టీవి ద్వారా లైవ్ ఏర్పాటు చేయగా దాన్ని అందరూ అనుసరించి బాబుతో పాటు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, జెడ్పీటిసి దొండపాటి రాము, సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ షేక్ షహానా బేగం, మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.