కృష్ణ

చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 8: ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 (చీటింగ్) కేసు నమోదు చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై బుధవారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్థానిక బోసుబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి విస్మరించారన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తానని చెప్పి విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ఇందుకు బాధ్యుడైన చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో విదేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఎడారిగా మారుస్తున్నారని ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటూ వాపును చూసి బలుపనుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బాబు నయవంచన పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అనంతరం అక్కడి నుండి నిరసన ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. స్టేషన్‌లో ఇన్‌చార్జ్ ఎస్‌ఐ నబీకి చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పామర్తి శ్రీనివాసరావు, జి కొండూరు జెడ్పీటిసి కాజా బ్రహ్మయ్య, పామర్తి వెంకటనారాయణ, నాగిరెడ్డి, అప్పిడి సత్యనారాయణరెడ్డి, పుల్లారెడ్డి, రహీం, కరీం, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

చెప్పులతో కొట్టాలనడం తప్పేమీ కాదు
గుడివాడ, జూన్ 8: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబును చెప్పులతో కొట్టాలని జగన్ అనడంలో తప్పేమీలేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో చంద్రబాబుపై పట్టణ సీఐ ఎంవి దుర్గారావుకు ఆయన ఫిర్యాదు చేశారు. హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడుతూ చెప్పులతో కొట్టించుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. గత నెల్లో తిరుపతిలో జరిగిన టిడిపి మహానాడులో ఎన్నికల హామీలను అమలు చేశానని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండేళ్ళ పాలనలో కోట్లాది రూపాయలను ఆర్జించి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎక్కడని ప్రశ్నించారు.
ముందుగా స్థానిక శరత్ థియేటర్ నుండి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా నేతలు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, ఎంవి నారాయణరెడ్డి, వైసీపి బిసిసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబాట రాజా, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, కౌన్సిలర్లు గొర్ల శ్రీను, కిలిమి వెంకటరెడ్డి పాల్గొన్నారు.