కృష్ణ

జల వనరుల శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 8: రెండేళ్ల జలవనరుల శాఖకు రూ.14,214.42 కోట్ల నిధులను కేటాయించి ఖర్చు చేయడం రాష్ట్రంలో సాగు, మంచినీటి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తేటతెల్లం చేస్తోందని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం మంత్రి కార్యాలయంలో రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దఎత్తున సందర్శకులు మంత్రికి అభినందనలు తెలియజేయడానికి కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవ్యాంధ్రలో అధికారం చేపట్టి 24 నెలలు పూర్తిచేసుకుని అశాస్ర్తియ విభజన వల్ల రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నాయకత్వంలో జలవనరులశాఖకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. జలవనరులకు నీటి సంరక్షణ చర్యలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మరింత ఉత్సాహంతో భూగర్భ జలాల స్థాయి పెంచేలా కృషి చేయాలని పంట సంజీవని, ఇంకుడు గుంతల నిర్మాణ పనుల్లో వ్యక్తిగత శ్రద్ధ, భాగస్వామ్యం చూపాలని మంత్రి కోరారు. ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టడం జరుగుతుందని, తోటపల్లి, పోలవరం, పట్టిసీమ, గుండ్లకమ్మ రిజర్వాయర్, వెలుగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులన్నారు. పోలవరం ద్వారా 7.20 లక్షల ఎకరాల సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్, పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, తోటపల్లి ద్వారా 74వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ద్వారా ఖరీఫ్‌లో 62,368 ఎకరాలు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు, వెలుగొండ ద్వారా 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగాను, గాలేరు-నగరి ద్వారా 4.79 లక్షల ఎకరాలకు సాగునీరు, హంద్రీ-నీవా ద్వారా 6.02 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 2014-15 సంవత్సరంలో రూ.3910.87 కోట్లు, 2015-16లో రూ.8964.66 కోట్లు, 2016-17లో రూ.1338.89 కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరిగిందన్నారు. నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్తున్నామని, కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, నారాయణపూర్-నాగావళిపై అధ్యయనం, వంశధార-మహీంద్రతనయ మరియు బహుధా నది, నాగావళి-సువర్ణముఖి-వేదవతి-చంపావతి నదులు, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు-చెట్టు ద్వారా 40వేల చెరువుల పూడికతీత పనులు చేపట్టి 24కోట్ల ఘనపు అడుగుల పూడికతీత తీశామన్నారు. 2104 గొలుసుకట్టు వ్యవస్థ ద్వారా 14,958 చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. రాష్ట్రంలో 29624 చెక్‌డ్యాంలు, 2,75,264 ఊటకుంటలు, 15,661 నేలలో తేమ పెంచే పనులు చేపట్టామన్నారు. 7,75 కోట్ల మొక్కలను, 21.57 టిఎంసిల నీటి సామర్థ్యం పెంపు చర్యలు, 4.55 టిఎంసిల భూగర్భ జలాల పునర్జీవనం, 2,22,243 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయగలిగామని చెప్పారు. రెండేళ్లు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, ముఖ్యమంత్రి స్ఫూర్తిని, పనితనానికి అనుగుణంగా నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఉమ పేర్కొన్నారు. ఈ సందర్భంలో పెద్దఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి అభినందనలు తెలియజేసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మైనార్టీ విభాగం తరుపున మంత్రిని గజమాలతో సత్కరించారు. అంతకుముందు మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి ఉమ కేక్ కట్ చేశారు.