కృష్ణ

అంతా కలిసి పనిచేస్తే మహా సంకల్ప సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, జూన్ 8: తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం ‘మహా సంకల్పం’ పేరుతో ద్వితీయ వార్షికోత్సవాన్ని స్థానిక దేవాంగ కల్యాణ మంటపంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలతో పాటు పెడన పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనగా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికారి సునీల్ రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడప నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈసందర్భంగా కాగిత మాట్లాడుతూ నూతన రాష్ట్రంలో అంతా కలిసి పనిచేస్తే మహా సంకల్పం దానికదే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సంసిద్ధతతో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన ఎంపిడివోలు గత రెండేళ్లుగా ఆయా మండలాల్లో జరిగిన ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ హన్ను, మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, సర్పంచ్ శలపాటి ప్రసాద్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న, జెడ్పీటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాబుకు అండగా నిలవండి
* ఎంపి కేశినేని
తిరువూరు, జూన్ 8: అశాస్ర్తియ, అడ్డగోలు విభజన తరువాత నవ్యాంధ్ర ప్రగతి లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై నిలబడి మద్దతు ఇవ్వాలని, నవ్యాంధ్ర ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాసరావు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నవనిర్మాణ వారోత్సవ ముగింపు సందర్భంగా జరిగిన మహా సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతి రహిత పారదర్శక పాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారన్నారు. ప్రపంచంలో తెలుగువారంతా గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం జరుపుతు నవ్యాంధ్ర కీర్తిని దశదిశలా చాటిచేప్పేలా అభివృద్ది, సంక్షేమం రెండు కళ్ళుగా అంకీతభావంతో పనిచేస్తున్నారన్నారు. సభలో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు మహాసంకల్ప ప్రసంగాన్ని వినిపించారు. సభాస్ధలి వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎంపి తిలకించారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎఎంసి చైర్మన్ తాళ్ళూరి రామారావు, ఎంపిపిలు గద్దె వెంకటేశ్వరరావు, వాసం మునీయ్య, నగర పంచాయితీ చైర్‌పర్సన్ ఎం కృష్ణకుమారి, వైస్ చైర్మన్ ఎస్ నరసింహారావు, ఎన్‌ఎస్‌పి ప్రాజెక్టు కమిటి చైర్మన్ వై పుల్లయ్య చౌదరి, డిసి చైర్మన్ సుంకర కృష్టమోహనరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
* జిల్లా అంతటా పోలీసులకు వైసిపి ఫిర్యాదులు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జూన్ 8: మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత పోలీసు స్టేషన్‌లలో చంద్రబాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేశారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మచిలీపట్నంలో ఆర్‌పేట పోలీసు స్టేషన్ ఎదుట మాజీ ప్రభుత్వ విప్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేర్ని వెంకట్రామయ్య (నాని) నేతృత్వంలో కొద్దిసేపు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. డౌన్.. డౌన్ సిఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, మోకా భాస్కరరావు, లంకే వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాస్, మారుమూడి విక్టర్ ప్రసాద్, షేక్ అచ్ఛాబా, మాదివాడ రాము, తదితరులు పాల్గొన్నారు. ఆర్‌పేట ఎస్‌ఐకు ఫిర్యాదు అందజేశారు.

కృష్ణా పుష్కరాలకు

శరవేగంగా దుర్గగుడి అభివృద్ధి పనులు
ఇంద్రకీలాద్రి, జూన్ 8: అటు మాస్టర్ ప్లాన్, ఇటు కృష్ణ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని దుర్గగుడి ఇవో ఆజాద్ అమ్మవారి సన్నిధిలో తలపెట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపట్టారు. సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో దుర్గగుడిని తిరుమల - తిరుపతి దేవస్థానం తరహాలోనే తీర్చిదిద్దేందుకు ఆయన కృత నిశ్ఛయంతో వాయువేగంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన మహాగోపురానికి అందమైన రంగులు వేయాలని ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భవానీదీక్ష మండపాన్ని కూల్చివేత పనులు సుమారు 95శాతం పూర్తయ్యాయి. దీంతో విశాలమైన స్థలం ఏర్పడింది. తర్వాత ఇవో బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు ఇవో చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఘాట్ ప్రారంభంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చేసి శ్రీ మల్లిఖార్జున మహామండపంలోని 5వ అంతస్తులోని షాపింగ్ కాంప్లెక్స్ దారులకు ఈ దుకాణాలను కేటాయించాలని ఇవో భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొండపైనున్న అన్ని సెక్షన్‌లను బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి సత్రంలోకి మార్చటంతో ఉద్యోగులు ఇక్కడే నుండే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొండపైన లడ్డూ, పులిహార తయారీ కేంద్రం, ప్రసాదాల కౌంటర్లు, రక్షబంధనాల విక్రయకేంద్రం మాత్రమే ఉన్నాయి. ఇదేవిధంగా మల్లిఖార్జునస్వామి ఆలయానికి సమీపంలోని కొన్ని దుకాణాలను సైతం కొండ కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తులను సాధ్యమైనంత వరకు శ్రీమల్లిఖార్జున మహామండపంలోనుంచి కొండపైకి పంపే పద్ధతిని నెమ్మదిగా అలవాటు చేసేందుకు ఇవో అజాద్ వివిధ కారణాలను చూపిస్తూ ఘాట్‌రోడ్‌ను మూసివేయటంతో భక్తులు చేసేదేంలేక మల్లిఖార్జున మహామండపంలో నుంచే కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటున్నారు. మల్లిఖార్జున మహామండపం వద్ద భక్తులు రద్ధీ పెరగటంతో దేవస్థానం బస్‌లను రైల్వే, బస్‌స్టేషన్‌ల నుండి నేరుగా ఈ మండపం వద్దనే ఆపుతున్నారు. దీంతో భక్తులు మల్లిఖార్జున మహామండపం, పాతమెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటున్నారు. శ్రీ మల్లిఖార్జున మహామండపం ముందు భాగంలో టూ వీలర్ పార్కింగ్, దేవస్థానం బస్‌లు, కార్లు పార్కింగ్ చేసుకునేందుకు ఇంజనీరింగ్ అధికారులు పార్కింగ్ స్ధలాలను సిద్ధం చేస్తున్నారు. ఈపార్కింగ్ స్థలాల ఏర్పాటు పనులు కూడా సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయి. గోశాల కమిటీ నుండి స్వాధీనం చేసుకున్న స్థలంలో ప్రస్తుతం దేవస్థానం బస్‌ల స్టాండ్‌ను వినియోగించుకొంటున్నారు. మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకొని మల్లిఖార్జున మహామండపం ప్రారంభలోనే చెప్పులస్టాండ్, క్లోక్‌రూమ్, సెల్‌ఫోన్‌ల లాకర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని ఇవో ఇప్పటికే ఇంజనీర్ డిఇ రమాదేవికి ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది పనులు ప్రారంభించారు. కొండపైకి వెళ్లే భక్తులు తమ సామగ్రి ఇక్కడ భద్రపర్చుకొని దర్శనం తర్వాత కిందకు వచ్చి తీసుకువెళ్లే విధంగా ఇవో చర్యలు చేపట్టారు. అర్జున వీధి వడ్లమన్నాటి శంకరమఠంలో ఇప్పటికే దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి సోమవారం నుండే భక్తులకు అన్నదానానికి ఇవో శ్రీకారం చుట్టారు. దేవస్థానం స్వాధీనం చేసుకున్న శ్రీ గంగాసమేత వసంత మల్లిఖార్జున స్వామివారి దేవస్థానం (బుద్దావారిగుడి)లో శాశ్వత అమ్మవారి ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇవో చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈసెక్షన్ పర్యవేక్షణాధికారి కె విజయ్‌కుమార్, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ కల్యాణ మండపంలోని వసతులు, చేయాల్సిన మార్పులు - చేర్పులు పరిశీలించి వివిధ అంశాలను ఇవో ఆజాద్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం గోశాల వెనుక వైపు సుమారు 17గృహాలు, పక్కనే ఉన్న శంకరమఠం, అంజనేయస్వామివారి గుడి కూడా స్వాధీనం చేసుకుంటే మరింత విశాలమైన స్థలం దుర్గగుడికి సమాకూరుతోంది. ఇవో అజాద్ ఈ మూడింటిని తొలగించి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించేది విశాలమైన ఈస్థలం కోసమే. దీనికితోడు ఇప్పటికే మల్లిఖార్జున మహామండపంలోనికి మెయిన్‌ప్రొవిజన్ స్టోరును సైతం తరలించారు. మల్లిఖార్జున స్వామిమెట్ల మార్గానికి ఇరువైపుల ఉన్న ఇళ్లను తొలగించి మెట్లను కూడా విస్తరించాలని ఇవో ఇప్పటికే అన్ని రకాలైన ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇదేవిధంగా ఆకులవారి వీధిలోని ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఇవో నగరపాలక సంస్థ కమిషనర్‌కి లేఖ రాసారు. దీంతో వియంసి కమిషనర్ ఆకులవారివీధిలో ఆక్రమణలను తొలగించాల్సిందిగా సిటీప్లానర్‌కు అదేశాలు జారీచేశారు. ఆ వైపు ఉన్న మెట్ల మార్గాన్ని కూడాడ వెడల్పు చేసేందుకు ఇవో చర్యలు చేపట్టారు.