కృష్ణ

సిపిఐ సీనియర్ నేత వెంకటేశ్వరరావు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూన్ 9: వక్కలగడ్డ గ్రామ మాజీ సర్పంచ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు రమణవరపు వెంకటేశ్వరరావు(86) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 16 సంవత్సరాలు గ్రామ సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన వెంకటేశ్వరరావు 1970 నుండి పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షునిగా కొనసాగుతూ సంఘాన్ని ప్రగతిపథాన నిలిపారు. 14 ఏళ్ల వయస్సులోనే పాల ఉత్పత్తిదారుల సంఘంలోకి ప్రవేశించిన ఆయన 1952లో కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై సిపిఐలో చేరి పార్టీ పటిష్ఠతకు కృషి చేశారు. పార్టీ అగ్ర నేతలతో సత్సంబంధాలు కలిగిన రమణవరపు వెంకటేశ్వరరావు గ్రామాభివృద్ధే ధ్యేయంగా తన పరిచయాలను వినియోగించుకున్నారు. రమణవరపు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రావి బాబూరావు, మల్లుపెద్ది రామసుబ్బయ్య, పరుచూరి శ్రీనివాసరావు, మాలెంపాటి కాంచనరావు, బెనర్జి, ఆదిశేషు, బుచ్చికోటేశ్వరరావు, తదితరులు ఆయన భౌతికకాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.