కృష్ణ

రూ.37 కోట్లతో శ్మశానాలు, పార్కుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 10: పట్టణంలో శ్మశానవాటికలు, పార్కులు, డ్రైనేజిల అభివృద్ధికి రూ.37.50కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక 2వ వార్డు తౌడు ఫ్యాక్టరీ వద్ద గల ఐదు సమాధుల రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మించేందుకు మంత్రి రవీంద్ర కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పట్టణంలో ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఐదు సమాధుల రోడ్డును రూ.7.79లక్షలతో సిసి రోడ్డుగా అభివృద్ధి పర్చే పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, కౌన్సిలర్లు మోదుగుమూడి శేషుబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, టిడిపి నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, పామర్తి నరేష్ పాల్గొన్నారు.