కృష్ణ

రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి, మరో 8 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూన్ 10: మండలంలోని చిల్లకల్లు - వైరా రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యాచకుడు మృతి చెందాడు, 8 మంది గాయపడ్డారు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మక్కపేట వైపు నుండి వస్తున్న లారీ ఆల్ సైన్స్ స్కూల్ సమీపంలో రోడ్డు దాటుతున్న యాచకుడిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కంగారులో స్టీరింగ్ అదుపు తప్పడంతో అదే మార్గంలో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరగడ్డ మాచవరానికి చెందిన 8 మంది గాయపడ్డారు. వీరిని 108లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆటోలో వెళుతండగా ఈ ప్రమాదం జరిగింది. చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.