కృష్ణ

ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా ‘మంగినపూడి బీచ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 10: మంగినపూడి బీచ్ ఇకపై ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా మారనుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మంగినపూడి బీచ్ అభివృద్ధికి తయారు చేసిన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగినపూడి బీచ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై శుక్రవారం మంత్రి రవీంద్ర విజయవాడలో కలెక్టర్ బాబు.ఎ, పర్యాటక శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీచ్ స్వరూపాన్ని మార్చే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రిసార్ట్స్, పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, స్పోర్ట్స్, హోటల్స్ ఇలా అన్ని రకాలుగా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చర్యలు ప్రారంభించామన్నారు. ప్రారంభమైన పనులు శరవేగంతో పూర్తి చేయాలన్నారు. ప్రారంభం కాని పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. నిత్యం పర్యాటకులకు కళకళలాడే విధంగా మంగినపూడి బీచ్‌ను తీర్చిదిద్దడం జరుగుతోందని చెప్పారు. బందరు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. బందరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. బందరు పోర్టుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. పోర్టు నిర్మాణం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు, బందరు ఆర్డీవో సాయిబాబు, ఎంపిడివో జివి సూర్యనారాయణ, పర్యాటక శాఖాధికారులు పాల్గొన్నారు.