కరీంనగర్

ఉద్యమ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 7: ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లే క్రీడల్లో అంకితాభావం, సమిష్టి కృషితో క్రీడాకారులు రాణించి ప్రపంచ స్థాయి పోటీల్లో తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో 61వ అఖిల భారత పాఠశాలల క్రీడా సమాఖ్య బాల బాలికల ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ అన్ని రంగాలతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఒలంపిక్స్, ప్రపంచ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. స్వల్ప వ్యవధిలో జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు విజయవంతంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం కృషి చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిఇటిలను త్వరలోనే పిడిలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ముప్పై ఏళ్ళ తర్వాత జాతీయ స్థాయి ఫుట్‌బాల్ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. అంతకుముందు మంత్రి ఈటల, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ లు పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఫుట్‌బాల్‌కు విశేష విశిష్ట సేవలందించిన సీనియర్ క్రీడాకారున్ని ఘనంగా సన్మానించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, డిఇఓ శ్రీనివాసాచారి, ఎస్‌జిఎఫ్ కార్యదర్శి తిరుపతిరెడ్డి, అర్జున అవార్డు గ్రహీత శ్రీనివాసరావు, డిఎస్‌డిఓ శివకుమార్, ఒలంపిక్ సంఘ ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.