కరీంనగర్

వరస దాడులతో విత్తన వ్యాపారులు బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 10: ప్రభుత్వం కో-మార్కెటింగ్ విత్తన విక్రయాలపై విధించిన నిషేధాన్ని తుంగలో తొక్కి విత్తన వ్యాపారులు కొనసాగిస్తున్న గుట్టు వ్యాపారంపై ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వైఖరితో విత్తన వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే తనిఖీ బృందాల వరస దాడులు మంచి ఫలితాలు ఇవ్వడం పట్ల రైతుల్లోను అనందం వ్యక్తం అవుతుంది. కో-మార్కెటింగ్ విధానంను పూర్తిగా నియంత్రించేందుకు విత్తన వ్యాపారులపై ప్రత్యేక తనిఖీ బృందాల దాడుల్లో విత్తనాలు వెలుగు చూడడం సంబంధిత శాఖ అధికారులను కూడా అశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కో-మార్కెటింగ్ విత్తనాల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరితో పాటు నియంత్రణకు జిల్లాల వారిగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖ ఈప్రాంతంలో కొనసాగిస్తున్న తనిఖీల్లో అదిత్య, ధీరజ్, డెనిమ్, అర్జున్, నవాబ్, సరోజ, ప్రిమ్స్, ధర్మ వంటి పేర్లతో విక్రయించే విత్తనాలన్ని కో-మార్కెటింగ్ విత్తనాలే అని చెబుతున్నారు. కానీ వందల పేర్లతో హోల్‌సెల్ విత్తన కంపెనీలు రిటైలర్లకు సరఫరా చేసే విత్తనాలు గుర్తించడం రైతుకు సవాలుగా మారింది. అయితే ఖరీఫ్ సీజన్‌కు ముందు గ్రామాల్లో వ్యవసాయ శాఖ చేపట్టిన మన వ్యవసాయం, మన తెలంగాణ పేరతో రైతు అవగాహన సదస్సులు నిర్వహించి సాగుబడి విధానంతో పాటు విత్తన ఎంపిక కీలమని, రైతు అప్రమత్తంతోనే నకిలీతోపాటు కో-మార్కెటింగ్ విత్తనాలను నియంత్రించుకోవాలని సూచించారు. పుట్టగొడుగుల్ల విత్తన కంపనీలు వివిధ పేర్లతో వాటిని మార్కెట్లో దించి విక్రయించడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో కేరాఫ్ లేని విత్తన కంపనీ విత్తనాలు విక్రయించడం కష్టంగా మారింది. గతంలో ఇలాంటి విత్తనాలు కొనుగోలు చేయడంతో రైతుల ఆరుగాలం శ్రమ, పంటకాలం, వేసిన ఏరువుల ఖర్చంత నష్టపోవాల్సి వస్తుండేదని రైతులు పేర్కొంటున్నారు. కో-మార్కెటింగ్ విత్తనాలపై వైపు రైతులు కనె్నత్తి చూడకుండా ప్రభుత్వం ముందుస్తు ప్రణాళికతో రైతుకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచితే సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. సకాలంలో విత్తనాలు లభించకపోవడంతోనే తాము కో- మార్కెటింగ్ విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని కొంతమంది రైతులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రత్తి విత్తన కంపనీలు మాత్రం ధర్మపురి, కొడిమ్యాల రైతులను టార్గెట్ చేసుకుని విక్రయాలు సాగిస్తున్నాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. డివిజన్‌లో మిగిలిన మండలాల్లో మొక్కజొన్న రైతులను టార్గెట్‌గా చేసుకుని కో-మార్కెటింగ్ మొక్కజొన్న విత్తనాలను విక్రయించేందుకు ప్రచారం ప్రారంభించాయి.