కరీంనగర్

దసరాకు రాజాద్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 10: కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కొలిక్కివచ్చింది. రానున్న విజయదశమి వరకూ కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఈమేరకు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాలతోపాటు మండలలాను కూడా పునర్‌వ్యవస్థీకరించనున్న దృష్ట్యా కరీంనగర్ దసరా నాటికి మూడు జిల్లాలుగా రూపుమారనున్నది. గతంలో ప్రకటించినట్లుగానే జిల్లాలో జగిత్యాలను జిల్లా చేయడంతో పాటు సిరిసిల్ల కేంద్రంగా శ్రీరాజరాజేశ్వరస్వామి పేరిట రాజాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.
కెసిఆర్ దీక్ష ఇక్కడి నుంచే..
రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి ఇక్కడి కొలువై భక్తజనకోటికి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. తెలంగాణ సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షకు ముందు రాజన్నను దర్శించుకోని ఉద్యమ సెగను తెలంగాణ ప్రాంతమంతా విస్తరింప చేశారు. అంతేకాకుండా కెసిఆర్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించి వేములవాడ ప్రాంత అభివృద్ధి కమిటీ అథారిటీని ఏర్పాటు చేశారు. దానికి స్వయంగా ముఖ్యమంత్రే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్ వేములవాడ నుంచి 12 కి.మీ దూరంలోని సిరిసిల్ల నియోజవర్గానికి ప్రతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల దేశంలోనే అతిపెద్ద చేనేత కార్మికులున్న ప్రాంతం. అటు ఆధ్యాత్మిక పరంగా , ఇటు వస్త్ర వ్యాపారపరంగా వేములవాడ, సిరిసిల్లలు విరాజిల్లుతున్నాయి. సిరిసిల్లను రాజాద్రి జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈవిషయమై స్వయంగా సిఎం కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.
కొత్త జిల్లాలో మండలాలు..
సిరిసిల్ల కేంద్రంగా రాజాద్రి జిల్లాగా ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లాలో సిరిసిల్ల, ముస్తాబాద్, కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డి పేట, చందుర్తి, వేములవాడ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గాన్ని కూడా కలుపుతారు. దీంతో పాటు చందుర్తి మండలంలోని రుద్రంగి, వేములవాడ అర్బన్ మండలాలను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.
ఆనందోత్సవాలు...
రాజాద్రి పేరు మీద సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆనందోత్సవాలు పెల్లుబికాయి. సిరిసిల్ల, వేములవాడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దసరా వరకు జిల్లాను ప్రకటించే అవకాశం మెండుగా ఉండటంతో ప్రజలు కెసిఆర్‌ను ప్రశంసిస్తున్నారు.