జాతీయ వార్తలు

నిత్యం బాధతో పనిచేస్తున్నాను:కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తాను గుండెల్లో ఎంతో బాధను దాచుకుని ప్రజల కోసం పనిచేస్తున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి ప్రభుత్వం సజావుగా సాగాలంటే అధికారుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం కోసం పనిచేయక తప్పదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియా ముందుకు వచ్చి ఇలా వ్యాఖ్యానించటం చర్చినీయాంశమైంది. గతంలోనూ కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతుంది. ఇదిలావుండగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమిలేదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని అన్నారు. వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని అన్నారు. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి వస్తూ సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.