జాతీయ వార్తలు

ఎలా పనిచేయాలో తెలుసు:కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: గ్రామస్తుల సమస్యలు తెలుసుకునేందుకు తాను ప్రారంభించిన గ్రామవాస్తవ్య కార్యక్రమంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటుగా స్పందించారు. తనకు ఎలా పనిచేయాలో తెలుసునని, వారి సర్ట్ఫికెట్ అవసరం లేదని అన్నారు. గ్రామవాస్తవ్య పర్యటన సందర్భంగా చంద్రంకి అనే గ్రామంలో ముఖ్యమంత్రికి ‘ఫైవ్‌స్టార్‌’ స్థాయిలో వసతులు కల్పిస్తున్నారని హేళన చేశారు. ఇలాంటి వసతులు అనుభవిస్తూ ప్రజల సమస్యలు ఎలా తెలుసుకుంటారని ప్రతిపక్ష నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కూమారస్వామి ఖండిస్తూ..తాను రోడ్డుపై పడుకునేందుకైనా సిద్ధమేనని అయినా కనీస వసతులు కూడా లేకుండా ఎలా పనిచేస్తారో ప్రతిపక్షాలు చెప్పాలని మండిపడ్డారు. తన కోసం ఏర్సాటు చేసిన బాత్‌రూమ్‌ని తానేమి పట్టుకుపోలేను కదా..అని చురకలంటించారు.