కర్నూల్

వైభవంగా బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 21 : వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందు లో భాగంగా ఎగువ అహోబిలంలో సోమవారం ఉదయం శ్రీ జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకాన్ని అర్చకులు రవి స్వామి నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అహోబిలంకు చెందిన కేశవన్ ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం తొట్టి తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. వెండి తొట్టిలో మంచినీరు పోసి నదులను ఆవాహం చేస్తూ ఉత్సవమూర్తుల విగ్రహాల పాదాలను ముంచి అభిషేకించారు. ఈ కార్యక్రమానికి చెన్నైకి చెందిన వడుకుపట్టు ఆవరముదన్ ఉభయదారులుగా వ్యవహరించారు. దిగువ అహోబిలంలో ఉదయం శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను మండపంలో కొలువుంచి 46వ జియ్యర్ శ్రీ వన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. దిగువ, ఎగువ ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి నాలుగు రోజుల పాటు అన్ని కులాలకు చెందిన సత్రాల్లో స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
బ్రాహ్మణ అన్నదాన సత్రం ప్రారంభం
దిగువ అహోబిలంలో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం భవన ముదాయాన్ని అహోబిల మఠం 46వ జియ్యర్ శ్రీవన్ శఠగోప రంగనాథ్ యతీంద్ర మహాదేశికన్ స్వామిజి ప్రారంభించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయిన పీఠాధిపతి సముదాయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ అన్నదాన సత్రాల నిర్వాహకులు లాభా పేక్షతో కాకుండా సేవాభావంతో కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అన్నదాన కమిటీ సభ్యులు సుబ్బయ్య, సుబ్బారావు, మురళీధర్‌శర్మ, కేశవశర్మ తదితరులు పాల్గొన్నారు.