కర్నూల్

కమనీయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, జనవరి 13:రెండు కళ్లు చాలవేమోన్నట్లు శ్రీగోదాదేవి శ్రీ వేంకటనాథుడి కల్యాణోత్సవం వేద మంత్రాల సాక్షిగా కన్నుల పండువగా జరిగింది. పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీ్భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య, ప్రధాన కార్యదర్శి మధుసూదనరావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కల్యాణ మండపం లో అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో వేద మంత్రాలు పఠిస్తుండగా, డాక్టర్ దీవిహయగ్రీవాచార్యుల చేత కల్యాణ తంతును చెబుతుండగా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. శ్రీగోదాదేవి శ్రీ వేంకటనాథుడి కల్యాణాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో తిలకిస్తుండగా వ్యాఖ్యాత దీవిహయగ్రీవాచార్యులు శ్రీగోదాదేవి, శ్రీవేంకటనాథుడి కథను వివరించారు. నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుడిని మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి అని, భక్తివిశ్వాసాలు ఉన్న భక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు శ్రీవైంకుంఠం నుంచి తరలివచ్చి అక్కున చేర్చుకుని సేద తీరుస్తాడని, అలా ఆ భగవానుడి అనుగ్రహం పొంది చివరకు స్వామిని వివాహమాడిన గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైందన్నారు. ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాలు నిత్యం పఠిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయన్నారు.
శ్రీగోదాదేవి శ్రీ వేంకటనాథుడి కల్యాణంతో ధనుర్మాసం పూర్తయిందన్నారు. స్వామి అమ్మవార్ల కల్యాణ దాతలుగా చంద్రయ్య, విజయలక్ష్మి దంపతులు, తిరుపతయ్య, చంద్రకళావతమ్మ దంపతులు వ్యవహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరుడు పల్లకీలో ఆశీనులై గ్రామోత్సవానికి తరలివెళ్లారు. స్వామి అమ్మవార్ల పల్లకికి పట్టణంలోని పురవీధుల్లో భక్తులు కాయకర్పూరం సమర్పించుకుంటూ మొక్కు తీర్చుకున్నారు.
జిల్లాకు గుర్తింపు తెచ్చే సినిమా తీస్తాం
* సినీ మాటల రచయిత వేమారెడ్డి
ఆదోనిటౌన్, జనవరి 13:జిల్లాలోని అన్ని ప్రాంతాలకు గుర్తింపు తెచ్చే విధంగా ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని డివిజన్‌ను మరీగుర్తించే విధంగా తన దర్శకత్వంలో మెగా హీరోలతో చిత్రం నిర్మిస్తానని సినిమా మాటల రచయిత వేమారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రాజశ్రీ కాంప్లెక్స్‌లో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు మల్లప్పతో కలిసి ఆయన ఖైదీ నం.150 చిత్రాన్ని తిలకించారు. అనంతరం వేమారెడ్డి మాట్లాడుతూ పరుచూరి బ్రదర్స్, సర్వానంద్, సాయిమాధవ్‌తో కలిసి తాను ఒక బృందంగా ఏర్పడి చిత్రానికి మాటలు అందించామన్నారు. ఇటీవల జరిగిన ఒక వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన నైపుణ్యాన్ని గుర్తించి వేదికపై ప్రశంశసించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తాను మంత్రాలయం నియోజకవర్గంలోని కల్లుదేవకుంటలో రైతు కుటుంబంలో జన్మించానన్నారు. ప్రస్తుతం తాను ఈస్థాయిలో ఉండటానికి తండ్రి తిమ్మారెడ్డి, తల్లి సరోజమ్మలే కారణమన్నారు. తాను ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ నటించిన చక్కిలిగింత చిత్రానికి దర్శకత్వం వహించానని, త్వరలోనే మెగా కుటుంబ హీరోలు చరణ్, అల్లు అర్జున్‌లతో చిత్రాలకు దర్శకత్వం వహిస్తానన్నారు. గతంలో ఠాగూర్ చిత్రానికి, ఇటీవలే చరణ్ నటించిన ధృవ, రచ్చ, అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య-2, రేసుగుర్రం, పవన్‌కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రాలకు మాటలు అందించానన్నారు. కార్యక్రమంలో అభిమానులు రైల్వే ఈరన్న, రాజశేఖర్, పూల బసవ, సూరి, సినిమా థియేటర్ల యజమానులు నారాయణరెడ్డి, చిన్న నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.