కర్నూల్

ఓట్ల లెక్కింపు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, మార్చి 20:స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం నగరంలోని టౌన్ మోడల్ కాలేజీలో ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఫలితాలు వెలువడ్డాయి. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. స్థానిక సంస్థలకు సంబంధించి 1077 ఓట్లు పోల్ కాగా, వాటిని లెక్కించగా టిడిపి అభ్యర్థికి 564, వైకాపా అభ్యర్థికి 502 ఓట్లు వచ్చాయి. ఇక చెల్లనివి 11 ఓట్లు ఉన్నాయి. అందులో నోటాకు ఒక ఓటు వేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్లని ఓట్లు 4 మాత్రమే ఉండగా ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య 11కు చేరింది. ఓటర్లకు సహాయకులుగా 90 మందిని ఏర్పాటు చేసినప్పటికీ చెల్లని ఓట్లు అధికంగా రావడం ఓటర్లకు అవగాహన లేకపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ముగిసే వరకూ కలెక్టర్ విజయమోహన్, పరిశీలకులు, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. చెల్లని ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా అభ్యర్థులకు చూపిస్తూ వాటిని వివరించారు.
భద్రత పరిశీలన
కర్నూలు : నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రం వద్ద భద్రతా చర్యలను సోమవారం ఎస్పీ ఆకే.రకృష్ణ పర్యవేక్షించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు డివి.రమణమూర్తి, జె.బాబుప్రసాద్, వినోద్‌కుమార్, సిఐలు డేగల ప్రభాకర్, జి.మధుసూదన్‌రావు, నాగరాజుయాదవ్, మహేశ్వరరెడ్డి, నాగరాజారావు, దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఉన్నారు.
తాగునీటి సమస్య
పరిష్కరించకపోతే ఎలా...
ఆదోనిటౌన్, మార్చి 20: పట్టణంలోని తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సుమారు 15 వార్డుల్లో గత వారం రోజులుగా తాగునీరు అందలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్యలు పరిష్కరించడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని టిడిపి కౌన్సిల్ ప్లోర్ లీడర్ తిమ్మప్ప, కౌన్సిలర్లు, వైజి.బాలాజీ, బి.బాలాజీ, టిడిపి నాయకులు లక్ష్మీనారాయణ, ముజీబ్, శ్రీనివాస ఆచారిలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కమిషనర్ గోవిందప్ప చాంబర్‌లో అధికారులతో వారు వాగ్వివాదంకు దిగారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని వార్డుల్లో వారం రోజులు, మరి కొన్ని వార్డుల్లో 10 రోజులైనా చుక్కు నీరు రాకపోవడంతో ప్రజలు పంపుహౌస్ వద్దకు, ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. ముఖ్యంగా పట్టణ శివారులోని వాల్మీకినగర్, హనుమాన్‌నగర్, అంబేద్కర్ నగర్ కిల్చిన్ పేట, బీరప్పకాలనీ, కౌడల్‌పేట, మండిగిరి, సాయిబాబానగర్, ఆర్టీసీ కాలనీ, కపర్తినగర్, ఇందిరానగర్, దివాకర్‌రెడ్డి నగర్‌లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాపోయారు. కనీసం ఆయా వార్డులకు ట్యాంకర్ల ద్వారా అయిన నీటి సరఫరా చేయకపోతే అధికారులను నిలదీశారు. గత వారం రోజుల నుంచి మోటార్లు మరమ్మతులు చేస్తున్నామని, పైపులైన్లు పగిలిపోతున్నాయి చెబుతున్నారే తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం ఏమిటని అన్నారు.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న కనీసం ఇంజినీరింగ్ అధికారులు వార్డుల్లో కూడా పర్యటించకపోవడం విచారకరమన్నారు. అలాగే వార్డులలోని బోర్లను మరమ్మతులు చేయాలని చెప్పిన పట్టించుకోలేదని, వేసవిలో తాగునీటి సమస్య వస్తుందని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం సమస్య తీవ్రంగా ఉందన్నారు. కేవలం అధికారులు కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొంటూ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.