కర్నూల్

కర్నూలును గ్రీన్‌సిటీగా మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 5:కర్నూలు నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చాలని రాష్ట్ర పురపాలక సంచాలకులు కన్నబాబు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. డిఎంఎ కన్నబాబు, స్ర్తి, శిశుసంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ సోమవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంచాలకులు మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చాలన్నారు. ప్రధానంగా నగరంలో పందులు లేకుండా చూడాలని పందుల పెంపకందారులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. శిశుసంక్షేమశాఖ కమిషనర్ జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ఇక జిల్లాలో సాధించిన ప్రగతి గురించి పిడి జుబేదాబేగంను అడిగి తెలుసుకున్నారు. దీంతో పిడి మాట్లాడుతూ 10 మున్సిపాలిటీ పరిధుల్లో 594 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 8,810 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.
అలాగే ఒకే వార్డులో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్న వివరాలను వివరించారు. అనంతరం అర్బన్ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్షించారు. వాటి వివరాలను వారం రోజుల్లోగా పంపాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ హరినాథ్‌రెడ్డి, ఎస్‌ఇ శివరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ కళ్యాణ్‌చక్రవర్తి, 9 ప్రాజెక్టుల సిడిపిఓలు, నగరపాలక, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
* ఎమ్మెల్సీ శమంతకమణి
డోన్, జూన్ 5:నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సిఎం చంద్రబాబు చేస్తున్న కృషి అమోఘమని, రాష్ట్భ్రావృద్ధి బాబుతోనే సాధ్యమని ఎమ్మెల్సీ శమంతకమణి, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. పట్టణంలోని షాదీఖానాలో సోమవారం ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ అధ్యక్షతన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, పొదుపు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆంధ్రులను అప్పుల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి సిఎం చంద్రబాబు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 24 గంటల విద్యుత్‌తో పాటు రూ. 1000 పింఛను, చంద్రన్నబీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అండగా నిలిచిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘం జిల్లా చైర్మన్ వై.నాగేశ్వరరావుయాదవ్, ఏపిఐడిసి మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికె గాయత్రీదేవి, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, ఎంపిడిఓ క్యాథరిన్, తహశీల్దార్ మునికృష్ణయ్య, టిడిపి పట్టణ అధ్యక్షుడు కొట్రికె ఫణిరాజ్, నాయకులు తిమ్మయ్య యాదవ్, సోమేష్‌యాదవ్, కొత్తకోట శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.