కర్నూల్

నాటి ఆళ్లగడ్డను తలపిస్తున్న నేటి నంద్యాల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో ఎన్నికలంటే ఒకప్పుడు అధికారులకు కత్తిమీద సాములా ఉండేది. అక్కడి ఎన్నికల్లో జరిగే హింసాత్మక సంఘటనలే అధికారుల ఆందోళనకు కారణం. అందుకు పూర్తి భిన్నంగా ప్రశాంత నియోజకవర్గంగా పేరొందిన నంద్యాలలో నేటి పరిస్థితి ఆళ్లగడ్డను తలపించే విధంగా తయారైందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా నంద్యాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం భూమా, శిల్పా వర్గాల మధ్య ఫ్యాక్షన్ తరహా విభేదాలు నెలకొనడమే. దీనికి తోడు ప్రచారపర్వంలో భాగంగా వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఇరు వర్గాలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నాయి. నంద్యాల బహిరంగ సభలో వైకాపా అధినేత జగన్ సిఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు, మహిళానేత, ఎమ్మెల్యే రోజా అఖిలప్రియ వస్తధ్రారణపై చేసిన వ్యాఖ్యలతో టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. విమర్శించడానికి ఏమీ లేకపోవడం వల్ల వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపిన్నారు. గతంలో రోజా సినిమాల్లో నటించిన సన్నివేశాలను ప్రజలకు ప్రదర్శించడం, జగన్‌పై కేసులు, విద్యార్థి దశ నుంచే ఆయన నేరప్రవృత్తి కలిగిన వ్యక్తంటూ టిడిపి చేస్తు న్న ప్రచారంతో వైకాపా నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడారని ఆయన ఇంటి ముందు మహిళలతో ధర్నా చేయడం వంటి చర్యలు నంద్యాలలో ఉద్రిక్తతను రేకెత్తిస్తున్నాయి. ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే వైకాపా అధినేత జగన్ 9 రోజులు ఇక్కడే మకాం వేస్తానని ప్రకటించడం, సిఎం చంద్రబాబు అదే సమయంలో రెండు రోజులు నంద్యాలలో ప్రచారం చేయడానికి వస్తుండటంతో పరిస్థితి అదుపు తప్పుతుందన్న ఆందోళన ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. దీంతో ఒకనాటి ఆళ్లగడ్డలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులు నేడు నంద్యాలలో కనిపిస్తున్నాయని భావించిన అధికారులు అదనపు బలగాలను అవసరమైతే పారామిలటరీని రప్పించి ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేస్తామని ఎన్నికల అధికారులు సిబ్బందికి భరోసా ఇస్తున్నారు. ఇదే విషయాన్ని త్వరలో ప్రజలకు తెలిపి పరిస్థితిని చక్కదిద్దుతామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి చేస్తున్నందుకు సిఎంను కాల్చాలా..
* జగన్‌ను ప్రశ్నించిన మంత్రి అమరనాథ్‌చరెడ్డి
నంద్యాల, ఆగస్టు 8: అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాల్చిపారేయాలా? అని వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం 24వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రచార సభలో మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, రాధాకృష్ణ, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఆర్‌ఐసి మాజీ చైర్మన్ ఎవి సుబ్బారెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నా తనకున్న రాజకీయ అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముస్లింల కోసం దుల్హన్, తోఫా పథకాలు అమలు చేస్తున్నారని, నంద్యాలలో ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న రోడ్ల విస్తరణ, చామకాల్వ, కుందూ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబు అనుభవం, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండ సిఎంను నడిరోడ్డుపై కాల్చి పారేయాలనడం మంచిది కాదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు సిఎంను కాల్చాలా అని సూటిగా ప్రశ్నించారు. నంద్యాలను అభివృద్ధి చేయాలన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని భూమా కుటుంబ సభ్యులు ప్రజల ముందుకు వస్తుంటే వైసిపి నాయకులు అనైతిక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పదవి కాంక్ష తప్ప అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంలేని శిల్పా సోదరులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ జగన్ రాజకీయంగా ఎదగడానికి తన తల్లిదండ్రులు చాలా శ్రమించారని, కాని ఈ రోజు ఆయన మాట్లాడుతున్న తీరు వేధనకు గురిచేస్తుందన్నారు. నంద్యాలను అభివృద్ధి చేయాలని తన తండ్రి భూమానాగిరెడ్డి ప్రయత్నిస్తే శిల్పాసోదరులు ఆయనపై అక్రమ కేసులు పెట్టి అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. అనంతరం వైసిపికి చెందిన 200 మంది కార్యకర్తలు మంత్రుల సమక్షంలో, టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. ఈకార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్‌కుమార్, నంద్యాల రూరల్ టిడిపి అధ్యక్షులు గురునాథరెడ్డి, 25వ వార్డు ఇన్‌చార్జి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్రునికి బంగారు దీపాంతులు
మంత్రాలయం, ఆగస్టు 8: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 346వ సప్త రాత్రోత్సవాలు సందర్భంగా మంగళవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో ఏర్పాటు చేసిన ప్రముఖుల సన్మాన కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు భక్తులు విరాళంగా ఇచ్చిన పాద కానుకలతో దాదాపు రూ. కోటి విలువ చేసే మూడు కిలోల రెండు బంగారు దీప కాంతులను చేయించారు. పూర్వారాధన సందర్భంగా వాటిని శ్రీ మూలరాముల దేవతామూర్తుల పూజలలో వినియోగిస్తునట్లు తెలిపారు. అలాగే కోయింబత్తూరు భక్తుడు వెండి కవచాలు విరాళంగా అందించారు.
శిల్పా నామినేషన్‌ను ఆమోదించినప్పుడే
టిడిపి ఓడిపోయింది
* వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
నంద్యాలటౌన్, ఆగస్టు 8: అభ్యర్థు ల పరిశీలనలో భాగంగా చివరి రోజు న వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ అఫిడవిట్‌లో న్యాయవాది నోటరీ లైసెన్స్ రెన్యూవల్ కాలేదని నామినేషన్ తిరస్కరించాలని టిడిపి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా ఆ అధికారి నామినేషన్ తన నిజాయితీని చాటుకుంటూ అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ చెప్పి నామినేషన్ ఆమోదించారని, అప్పుడే టిడిపి ఓడిపోయిందని వైకాపా అధికార ప్రతినిధి అంబ టి రాంబాబు అన్నారు. మంగళవారం వైకాపా కార్యాలయం లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించా రు. రోడ్ల వెడల్పుపై సిఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లిన శిల్పా మోహన్‌రెడ్డిని అవహేళన చేశారని, డబ్బులు ఇవ్వండి వేయిస్తానని చెప్పిన సి ఎం నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. అమరావతి తరహాలో గ్రాఫిక్స్ జిమ్మిక్కులు చేస్తూ రాష్ట్ర ప్రజలనే కాకుండా నంద్యాల ప్రజలను కూడా మోసం చేస్తున్నారన్నారు. నంద్యాలలో గెలవడం కోసం అభివృద్ధికి వైకాపా అడ్డుకుంటుందని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో అభివృద్ధిని కోరుకొనే శిల్పా మోహన్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి టిడిపికి బుద్ధి చెప్పాలన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ నైతిక విలువలు వైకాపాకు ఉన్నాయి కాబట్టే శిల్పా చక్రపాణిరెడ్డితో బహిరంగంగా రాజీనామా చేయించి వైకాపాలో చేరారన్నారు. డమ్ముంటే, నైతిక విలువలు ఉంటే వెంటనే టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ పాటించాలి
* ఎన్నికల పరిశీలకులు హిమాంషు జ్యోతి చౌదరి
నంద్యాల, ఆగస్టు 8: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు హిమాంషు జ్యోతి చౌదరి అన్నా రు. మంగళవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఉప ఎన్నికల పోటీ లో ఉన్న అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు పార్టీ కార్యాలయాన్ని పార్టీకి ఒక్క కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, అదనపు పార్టీ కార్యాలయాల ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించే పివోలు, ఎపిఓలు, సిబ్బందిని నంద్యాల డివిజన్‌లోని సిబ్బందిని కాకుండ ఇతర ప్రాంతాల వారిచే కంప్యూటర్ మిషన్ ద్వారా విధుల ఉత్తర్వుల జాబితా వెలువరించడం జరుగుతుందన్నారు. జాబితా ప్రకారం అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి వారి జమా ఖర్చులు రిజిస్టర్‌లో తప్పక ఏ రోజు ఖర్చులు ఆ రోజు నమోదు చేయాలని, పార్టీ పరంగా పబ్లిసిటి కొరకు ఏర్పాటు చేసుకొనే ఫ్లెక్సీలను ఆర్‌ఓ అనుమతితోనే ఏర్పాటు చేసుకోవాలని, లేని ఎడల వాటిని ఎన్నికల సిబ్బంది గుర్తించి వారి ఖర్చు జాబితాలో జమ చేస్తారన్నారు. ఎన్నికల సమావేశాలు నిర్వహించేందుకు కూడా అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థి కొత్తగా తెరువబడిన బ్యాంకు ఖాతా నుండే లావాదేవీలు జరపాలన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సహకరించినట్లు తెలిస్తే ఎన్నికల కమిషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టరాదని, అభ్యర్థి తన అజెండాను మాత్రమే ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటరు ఓటు వేసిన వెంటనే ఎవరికి ఓటు వేసింది పక్కనే ఉన్న మిషన్‌లో చూసుకోవచ్చన్నారు. ఏవైన సమస్యలు ఎదురైతే కేంద్ర పరిశీలకులకు ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సరస్వతీపుత్రా నమో నమామి..
* సింహవాహనంపై ఊరేగిన శ్రీప్రహ్లాదరాయులు..
* శ్రీరాఘవరాయలుకు పూర్వారాధన వేడుకలు..
మంత్రాలయం, ఆగస్టు 8: భక్తికోటి నీరాజనం అందుంకుటున్న పరమ పావనమూర్తి మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 346వ సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం పూర్వారాధన వేడుకలు సందర్భంగా శ్రీప్రహ్లాదరాయలు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఏడురోజులు పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు పురస్కరించుకుని రాత్రి శ్రీమఠంలో ఉత్సవమూర్తి శ్రీప్రహ్లాదరాయలను స్వర్ణపల్లకి, గజ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠం ప్రాకారంలో అశేష భక్తుల హర్షధ్వనులు, మంగళవాయిద్యాలుతో వేదపండితుల మంత్రోచ్ఛరణలు మధ్య వైభవంగా ఊరేగించారు. ఉత్సవమూర్తికి ఊంజల సేవ నిర్వహించి మహామంగళహాతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్ గిరియాచార్యులు, ఎఓ రొద్దం ప్రభాకర్, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాదవాచార్, కుర్డి జయతీర్థాచార్, మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీరాఘవేంద్రుడికి నిత్యపూజలు..
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామికి మంగళవారం నిత్యపూజలు జరిగాయి. 346వ సప్త ఆరాధనోత్సవాలు సందర్భంగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యపూజల్లో భాగంగా ఉదయం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, ఉత్సవరాయల పాదపూజ, నిర్మల్యవిసర్జన, కనక మహపూజ తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. సంస్తాన పూజలు సందర్భంగా మూలరాములు, దిగ్విజయరాములు, సంతాన గోపాల కృష్ణ, వైకుంఠవాసుదేవామూర్తులకు అలంకార సంతర్పణం, అష్టోదకం మహామంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామి మూల బృందావనానికి స్వర్ణకంచం, కర్నాటక నుండి తెచ్చిన వివిధ ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకుని మొక్కుకలు తీర్చుకున్నారు
అలరించిన దాసవాణి కార్యక్రమాలు..
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం యోగీంద్ర కళామండపంలో మంగళవారం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సాయంత్రం దాసవాణి కార్యక్రమాలను నిర్వహించారు. బెంగళూరుకు చెందిన విడుషి రమ్య వశిష్ట, గుల్బర్గకు చెందిన విద్వాన్ ప్రసన్నకోర్టి వారిచే నిర్వహించిన దాసవాణి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వారికి పీఠాధిపతి శేష వస్త్రం ఫల మంత్రాక్షితలు, జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు
పుస్తకావిష్కరణ
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 346వ సప్త ఆరాథనోత్సవాలు సందర్భంగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు పుస్తక ఆవిష్కరణ చేశారు. మంగళవారం సాయంత్రం యోగీంద్ర కళామండపంలో శ్రీమఠం ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన నూతన అధ్యాయన పుస్తకాలు హరిదాసురుకండ విద్యా మఠం (కన్నడ), అణువ్యాకాయన లగుకషిక (సంస్కృతం), కర్మనిర్ణాయాత ప్రకాషన (సాంస్కృత) పుస్తకాలను పీఠాధిపతి ఆవిష్కరించారు.
అభ్యంతరకర వార్తాంశాలపై అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, ఆగస్టు 8:నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి వార్తా పత్రికల్లో అభ్యంతకర వార్తాంశాలపై సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యనారాయణ మీడియా సర్ట్ఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) సభ్యులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పెయిడ్ న్యూస్‌పై మీడియా సర్ట్ఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో జాయింట్ కలెక్టర్, నంద్యాల ఆర్‌ఓ ప్రసన్న వెంకటేష్, జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్తా పత్రికల్లో నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల వార్తాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెయిడ్ న్యూస్, అభ్యంతరకర కథనాలకు సంబంధించి అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లా స్థాయి తరహాలోనే నంద్యాల నియోజకవర్గంలో కూడా ఎంసిఎంసి కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలో నంద్యాల ఆర్‌డిఓ, నంద్యాల అడిషనల్ పిఆర్‌ఓ, దూరదర్శన్ ప్రతినిధి రమణ తదితరులను నియమించామన్నారు. నంద్యాల జోన్‌లో ప్రచురితమైన పెయిడ్ ఆర్టికల్స్, అభ్యంతరకర వార్తలకు రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేస్తారన్నారు. వార్తాంశాలపై సంబంధిత అభ్యర్థులు సమర్పించిన నివేదికలను కూడా జిల్లా స్థాయి ఎంసిఎంసికి పంపిస్తామని ఆర్‌ఓ తెలిపారు. సమావేశంలో కేంద్ర క్షేత్రప్రచార అధికారి శివహరినాయక్, సమాచార శాఖ డిడి సుకమార్, డిఇఇ బాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంగమేశ్వరంలో అర్ధరాత్రి గ్రహణ దోశ నివారణ క్రతువు
పాములపాడు, ఆగస్టు 8:ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల కృష్ణాతీరంలో చంద్రగ్రహణం సోమవారం రాత్రి 10.55 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.45 గంటలకు ముగిసింది. చంద్ర గ్రహణం 90 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనిపించింది. అనంతరం ఆలయ వేద పండితులు ఆచార్య తెలకపల్లి రఘురామశర్మ గర్భాలయంలోని వేపధారు శివలింగానికి విశేష పూజలు నిర్వహించారు. గ్రహణం పట్టే సమయంలో కృష్ణానదిలో, విడిచే సమయంలో భవనాశిని నదిలో భక్తులు దోశ నివారణ, స్నానాలు ఆచరించారు. గ్రహణ ప్రారంభంలో నల్లమల అరణ్యంలో నెమళ్లు, ఇతర పక్షులు ఒక్కసారిగా అరిచాయి. కుక్కలు ఇతర వన్యప్రాణులు అరుపులు పెద్దఎత్తున వినిపించాయి. కాగా అష్టాదశ శక్తిపీఠాల్లోని శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, అలంపూర్ జోగులాంభ ఆలయాలను మూసి వేస్తే మిగిలిన 15 శక్తి పీఠాల్లో గ్రహణం రోజున పూజలు జరుగుతాయని, అసలు ఆలయాలు ఎందుకు మూయాలో ఏశాస్త్రంలో చెప్పలేదని తెలకపల్లి పేర్కొన్నారు. గ్రహణం సమయంలో సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం మూసివేయబడదన్నారు. ఇక్కడ గ్రహణ దోశ నివారణ క్రతువు విశేషంగా జరగడం మరో విశేషమన్నారు. చంద్రగ్రహణం దృశ్య ఆవిష్కరణ చూసి వీక్షకులు, భక్తులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈ నెల 19వ తేదీ లోగా శ్రీశైలం జలాశయానికి నీరు చేరకుంటే వరుణ సహస్ర ఘటాభిషేకం పూజలు, హోమాలు ప్రారంభిస్తామని వేదపండితులు తెలిపారు.
కర్నూలు నుంచి భరత్ పోటీ
* ఎంపి టిజి వెంకటేష్
ఆదోని, ఆగస్టు 8: తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తారని, టికెట్ వస్తే కర్నూలు నుండే టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని రాజ్యసభ సభ్యులు జిటి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం టిజి వెంకటేష్ విలేఖర్లతో మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి తన వంతు కూడా కృషి చేశామని, అందువల్ల తెలుగుదేశం పార్టీ టికెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని కోరుతామన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి తాను తన వంతుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి
* తెలుగు మీడియం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
* రాయలసీమ ఐజి మహ్మద్ ఇక్బాల్
ఆదోని, ఆగస్టు 8: ఈ విద్యా సంవత్సరం నుంచి పట్టణాల్లో ఉన్న మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పే విధానం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి తెచ్చారు, కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకోని వస్తానని రాయలసీమ జోన్ ఐజి మహ్మద్ ఇక్బాల్ అన్నారు. డిఎస్పీ శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్‌ఎంహెచ్‌ఎస్ మున్సిపల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సమావేవంలో విద్యార్థులతో రాయలసీమ ఐజి ముఖాముఖిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఐజి మాట్లాడుతూ తాను కడప, పలమనేరు, మదనపల్లె, ప్రొద్దూటూరు మొదలగు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నానని, పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అందరు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. నేడు విద్య, వైద్యం ప్రధానమైనవన్నారు. నేటి బాలురే రేపటి పౌరులని, చదువుకున్న విద్యా సంస్థకు ఈప్రాంతంలో పుట్టిన మనం రుణం తీర్చుకోవడానికి విద్యార్థి లోకానికి సహాయం చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కుర్చీలు, కంప్యూటర్లు, మరుగుదొడ్లు, తాగునీరు మొదలగు వాటిని నిర్మించడానికి అదికారు లు సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యార్థులకు కావాల్సిన మైదానాలు, క్రీడా సామగ్రి అందజేయాలన్నారు. అన్ని శాఖల అధికారులతో ఐక్యంగా ఉండి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లు, తాగునీరు ఇతర సౌకర్యలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కల్గిన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కల్గిన చదువులు లభిస్తాయన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. విద్యార్థులు పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను ఐజి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు. సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, ఆర్డీఓ ఓబులేసు, మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, విద్యాధికారి శివరాముడు, ప్రధానోపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ మైదానాన్ని పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో మున్సిపల్ మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అనుకూలంగా ఉండాలన్నారు.

వ్యక్తిగత విమర్శలు తగదు
* మాజీ స్వీకర్ నాదెండ్ల మనోహర్
ఆదోని, ఆగస్టు 8: నంద్యాలలో జరిగే ఉప ఎన్నికకు ఇంత ఆర్భాటం, హడావిడి అవసరం లేదని ఉభయ రాష్ట్రాల మాజీ స్వీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఆదోనిలో జరిగిన విలేఖర్ల సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాదారణ ఎన్నికల విధంగా నాయకులు ప్రచారాలు సాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైకాపా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి చేసిన విమర్శలను ఆయన దృష్టికి తీసుకురాగా విమర్శలు ఎప్పుడు వ్యిక్తిగతంగా ఉండరాదని, విమర్శలు అన్ని కూడా ప్రజలను ఆకర్శించే విధంగా ఉండాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల విధానాలను ప్రజలకు వివరిస్తూ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన చేసినప్పడు ఓటమి సహజమని అందువల్ల విబేదాలు లేకుండా పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేశామన్నారు. టిడిపి పాలనలో రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరిగిందని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతం వైపే ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేపట్టిన అనేక నీటి పారుదల ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయని చెప్పారు. సీమ అన్యాయంపైన తాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్లు చెప్పారు. నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ప్రచారం కోసమే పని చేస్తున్నాయని ఎద్దేవ చేశారు.
ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలి
* ఐజి మహ్మద్ ఇక్బాల్
ఆదోని, ఆగస్టు 8: ప్రతి ఒక్కరూ మానవ్వంతో మెలగాలని రాయలసీమ జోన్ ఐజి మహ్మద్ ఇక్బాల్ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మంగళవారం రాత్రి జరిగిన శాంతి సమావేశంలో పట్టణంలో ఉన్న అన్ని మతాలకు చెందిన పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ దేవుడు ఎక్కడో లేడని, ప్రతి మనిషి గుండెల్లో, మనస్సుల్లో ఉన్నాడన్నారు. మానవుడు సమాజ సేవా చేసినప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుందని స్పష్టం చేశారు. కొన్ని అల్లరి మూకలు మత విద్వేశాలను రెచ్చెగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నాయని, అలాంటి ఆరాచక శక్తుల ఆటలను సాగనివ్వరాదన్నారు. ప్రతి మనిషికి సాటి మనిషిని ఆదరించి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత వస్తుందన్నారు. నేడు దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో శాంతి కోసం ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, ఆర్డీఓ ఓబులేసు, డిఎస్‌పి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, తెలుగుదేశం నాయకులు విట్టారమేష్, ఫకృద్దీన్, వైకాపా నాయకులు గోపాల్‌రెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బసవన్నగౌడ్, ముస్లిం పెద్దలు అల్త్ఫా హుసేని, హాలీహస్మీ, బిజెపి నాయకులు కునిగిరి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీమఠంలో ప్రముఖులు
మంత్రాలయం, ఆగస్టు 8: మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు తిలకించేందుకు కర్నాటక బిజెపి నాయకులు మాజీ డిప్యూటీ సిఎం ఈశ్వరప్ప, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీ్ధర్‌రావు, కర్నాటక ఉప లోకాయుక్త న్యాయమూర్తి సుభాష్, టిటిడి ఇఓ అనిల్ సింగాల్ వచ్చారు. వారికి పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం ఫల మంత్రాక్షితలు, జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు
ప్రముఖులకు రాఘవేంద్ర ప్రశస్తి అవార్డులు
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 346వ పూర్వారాధన వేడుకలు సందర్భంగా మంగళవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో వెంకటేశాచార్ దంపతులకు, రాజమండ్రి గోపాలకృష్ణ శాస్ర్తి దంపతులకు, విఠల్ దంపతులకు, కోయింబత్తూరు గురురాజ దంపతులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు అందించారు.
కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి
ఆదోనిటౌన్, ఆగస్టు 8: శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 15 నిర్వహిస్తున్న సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని, పూజా విధానం ప్రత్యేకంగా నిర్వహించాలని చిన్మయ మిషన్ స్వామీజీ ప్రేమాయానంద పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు కృష్ణాష్టమి వేడుకలకు సందర్భంగా శిక్షణ కార్యక్రమం చిన్మయ మిషన్‌లో నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా పూజలు ఎలా చేయాలి, ఏవిధంగా చేయాలని అనే విషయంపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిర్వహించారు. విద్యార్థులకు చిన్మయ మిషన్ తరపున పూజా సామగ్రిని ఉచితంగా స్వామిజీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో విట్టారాధిక, స్వప్న, ఉషా, తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్రస్వామి ఉత్సవాలు ప్రారంభం
హొళగుంద, ఆగస్టు 8: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి 344వ ఆరాధనోత్సవాల్లో భాగంగా హొళగుందలో మంగళవారం పూజలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. స్వామివారి ప్రధాన అర్చకుడు నరసింహాస్వామి ఆధ్వర్యంలో పూర్వారాధన, స్వామివారికి తులసి అర్చన, అభిషేక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
దేవాలయంలో పూజలు చేసిన టిజి
ఆదోని, ఆగస్టు 8: ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కుటుంబ సభ్యులతో మంగళవారం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ పురోహితులు ఆశీర్వచనలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నబసప్ప టిజి. వెంకటేష్‌ను శాలువ కప్పి సన్మానించారు. ఆదేవిధంగా దేవాలయంలో చంద్రగ్రహణం తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. పూజలు తరువాతనే టిజి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈరన్నస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
కౌతాళం, ఆగస్టు 8: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈరన్నస్వామి దేవాలయంలో మూడవ సోమవారం సంబంధించిన హుండీ ఆదాయాన్ని మంగళవారం కాలక్షేప మండపంలో లెక్కించారు. ఈసందర్భంగా ఉరుకుంద ఈరన్నస్వామి ట్రస్టుబోర్డు చెన్నబసప్ప, ఇఓ మల్లికార్జున ప్రసాద్‌లు మాట్లాడుతూ భక్తులు స్వామివారికి నగదు రూపంలోరూ.27లక్షల 32వేల 946లు సంర్పించినట్లు తెలిపారు. అలాగే వెండి 9.3 కిలోలు, బంగారం 7 గ్రాముల 300మిల్లీలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బందితోపాటు ప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, పాలక మండలి సభ్యులు మల్లికార్జున, కొట్రేష్‌గౌడ్‌లు పాల్గొన్నారు.
గద్దరాళ్ళ మారెమ్మకు ప్రత్యేక పూజలు
దేవనకొండ, ఆగస్టు 8: మండల పరిధిలోని గద్దరాళ్ళలో వెలసిన శ్రీమారెమ్మ దేవతకు మంగళవారం భక్తు లు ప్రత్యేక పూజలు చేశారు. మారెమ్మదేవతకు పుట్టినిల్లుగా చెప్పుకునే పల్లెదొడ్డి గ్రామస్థులు దాదాపు 60 కుంబాలతో ఒకే సారి వరుసగా వచ్చి పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడవ మంగళవారం మారెమ్మ దేవతకు పల్లెదొడ్డి, గద్దరాళ్ళ గ్రామస్థులు చల్లబోయడం అనవాయితి. ఆయాగ్రామాల గ్రామాలతోపాటు వివిధ గ్రామాల నుండి గద్దరాళ్ళకు భక్తులు భారీగా తరలి వచ్చి తమను చల్లగా చూడాలని ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని వర్షాలు భాగా కురిసి పంటలు భాగా పండాలని మారెమ్మను వేడుకుంటూ పూజలు చేశారు.

అభివృద్ధి సంక్షేమ పథకాలు
కొనసాగాలంటే టిడిపిని గెలిపించండి
నంద్యాల, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధితోపాటు నంద్యాల పట్టణం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని నందిగ్రూప్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, యజమానుల ఆత్మీయ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి, నంది గ్రూప్ ఎండి సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, సుజలమ్మ, అరవిందరాణి, నంది గ్రూప్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈసమావేశంలో మంత్రులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నంది గ్రూప్ కలసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
క్షమాపణ చెప్పి నంద్యాలలో అడుగు పెట్టు...
నంద్యాల ఉప ఎన్నిక వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యం అనే అమృతంలో జగన్ విషపు చుక్కలు చల్లాడని, ప్రజలకు క్షమాపణ చెప్పి నంద్యాలలో పర్యటించాలని టిడిపి అధికార ప్రతినిది, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిని నిశితంగా విమర్శించారు. ఈనెల 3న నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో జగన్ చంద్రబాబును కాల్చి చంపమని పిలుపునివ్వడాన్ని రాష్ట్ర ప్రజానికం తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరమా? అని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి అభివృద్ధిని అజెండాగా చేసుకొని కష్టపడుతుంటే నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన ప్రతిపక్ష నేత నిరంతరం అభివృద్ధి నిరోదకుడుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పకుండ నంద్యాలలో అడుగు పెడితే ప్రజల నుండి ప్రతిఘనట ఎదుర్కోవాల్సి ఉంటుందని డొక్కా మాణిక్య వర ప్రసాద్ హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నంద్యాల పార్లమెంటు పరిశీలకులు గోవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు అండ
తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నది సిఎం చంద్రబాబునాయుడు అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నిక శిల్పా, భూమా కుటుంబాల మధ్య కాదని, టిడిపికి, వైకాపా మధ్య జరుగుతుందన్నారు. జగన్ అస్థిత్వం కోల్పోయి చంద్రబాబుపై దుర్భాషలాడుతున్నారన్నారు. జగన్, రోజా ఒకరిపై ఒకరు పోటీ పడుతూ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. మాజీ మంత్రి, బిజెపి నాయకులు మారెప్ప మాట్లాడుతూ జగన్ పార్టీకి దిశా నిర్ధేశం లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతున్న దశలో నంద్యాల ఎన్నికలో పోటీ చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైకాపా నాయకులకు భాషా పరిజ్ఞానం లేదని, చక్రపాణిరెడ్డి చెప్పేవన్ని తప్పుడు మాటలేనని, కడప జిల్లాలోని తన సొంత ఊరులో సర్పంచుగా గెలువలేని చక్రపాణిరెడ్డికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన విషయాన్ని వారు మరచిపోతున్నారన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు.
రాయలసీమ సమగ్రాభివృద్ధికి కృషి
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసిరెడ్డి
నంద్యాలటౌన్, ఆగస్టు 8:లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రత్యేక హోదా, రాయలసీమ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప ఎన్నికల ఇన్‌చార్జి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టిడిపి సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిలు పలకడం దారుణమన్నారు. ఈరెండు పార్టీలలో ఏపార్టీకి ఓటు వేసినా బిజెపికి ఓటు వేసినట్లే అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌ను గెలిపించాలన్నారు.