కర్నూల్

అంతాసిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 22: నంద్యాల ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తును తేల్చేందుకు ఓటర్లు సిద్దమయ్యారు. బుధవారం జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,858 మంది ఉండగా వీరిలో పురుషులు 1,07,778, మహిళలు 1,11,018 మంది, ఇతరులు 62 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నంద్యాల పట్టణంలో 1,42,628 మంది, నంద్యాల గ్రామీణ మండలంలో 47,386, గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 110 పోలింగ్ కేంద్రాలు, 257 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అయితే ఒక బూత్‌కు గరిష్టంగా 1200, నంద్యాల పట్టణంలో 1400 చొప్పున ఓటర్లను కేటాయించారు. మొత్తం ఓటర్లలో 2.01లక్షల మందికి ఓటరు స్లిప్పులను బూత్ స్థాయి అధికారులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 18,500 మంది మరణించినట్లు, ఒకటికి మించి ఓటు ఉన్నట్లు తేలడంతో వాటిని పంపిణీ చేయలేదని తెలిపారు. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఆయ పార్టీల నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. అసలు ప్రచారం ముగియడంతో రాజకీయ పార్టీలు విజయం కోసం చివరి ప్రయత్నాలను ఏ లోపం లేకుండా ముగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి వేళల్లో నిద్ర లేకుండా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకుంటూ గడిపారు. ప్రచార గడువు ముగియడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు రాత్రి వేళల్లో ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. ప్రచారం ముగిసిన వెంటనే ఒకరిద్దరు మినహా ఇతర నేతలంగా నంద్యాల వీడి వెళ్లారు. అంతకు ముందే గ్రామ, వార్డు స్థాయి నాయకులకు, కార్యకర్తలకు రాత్రి వేళ చేయాల్సిన పనులను పురమాయించి వారికి అవసరమైన వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. నాయకులు వెళ్లిన అనంతరం తమకు కేటాయించిన వార్డులు, గ్రామాలకు చేరుకున్న నాయకులు రాత్రంతా ఓటర్లను కలుసుకొని వారికి ఇవ్వాల్సినవి ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం కనిపించింది. మంగళవారం ఉదయం నుంచి సాధారణ ప్రచారానికి నమూనా బ్యాలెట్ పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టి సోమవారం రాత్రి కలుసుకోలేని వారికి ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఓటర్లకు ఓటరు స్లిప్పులు రాజకీయ పార్టీలే ఇచ్చేవి. అయితే 2009 నుంచి ఎన్నికల కమిషనే ఓటర్లకు ఓటర్లకు స్లిప్పులను బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో పంచుతుండటంతో కార్యకర్తలకు ఆ ఇబ్బంది తప్పింది. అయితే ఓటరుకు ఓటరు స్లిప్పు అందని వారికి ఓటరు జాబితాలో పేరు ఉంటే వారికి కార్యకర్తలు ఓటరు నంబరు ఇచ్చి ఓటరు, ఆధార్, రేషన్ కార్డు వంటివి ఏది తీసుకుపోయినా ఓటు వేయవచ్చని అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు కేంద్ర, రాష్ట్ర బలగాలు చేరుకోవడంతో పంపిణీ కార్యక్రమాన్ని నిలిపి వేసి పోలింగు, పోలీసు అధికారులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల అధికారులు వారి నుంచి సహకారాన్ని నిరాకరిస్తుండగా మరి కొన్ని చోట్ల స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని రాజకీయ పార్టీల నుంచి గ్రామస్థుల నుంచి ఏమీ తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లు తన తీర్పును ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తారు వేచి చూడాలి.

పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
నంద్యాల, ఆగస్టు 22: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు అవసరమైన ఇవియంలు, వివిప్యాడ్‌లు, ఇతర సామాగ్రి, పోలింగ్ సిబ్బందిని పోలీసుల రక్షణలో ఆయా పోలింగ్ బూత్‌లకు తరలించారు. అసెంబ్లీ పరిధిలో 255 పోలింగ్‌బూత్‌లు ఉన్నాయి. ఈ పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఒక్కొక్క పోలింగ్‌బూత్‌కు 10 నుండి 11 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వద్ద తహశీల్దార్ స్థాయి గల గజిటెడ్ అధికారిని ఆర్‌వో నియమించారు. పోలింగ్‌బూత్ వద్ద కేంద్ర బలగాలు, ఎపిఎస్‌పి పోలీసులు పనిచేస్తుండగా క్యూలైన్ల నిర్వహణ హోంగార్డులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు విధినిర్వహణలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో ముగ్గురు ఐపిఎస్ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నికల సంఘం నియమించింది. నంద్యాల పట్టణంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, గోస్పాడు మండలంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును నియమించారు. మంగళవారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎన్నికల సామగ్రిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలింగ్ బూత్‌తోవెబ్ కాస్టింగ్‌తోపాటు వీడియో కెమెరాతో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే నంద్యాల ఆర్డీవోకార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూములో వెబ్ కాస్టింగ్ కోసం బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగకుండ చూసేందుకు ట్రాన్స్‌కో అధికారులు, ఇవియం మిషన్లకు ఏదైన సమస్య వస్తే అప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆ మిషన్లను తయారుచేసిన ఇసిఐఎల్ అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూములో ఉండడమే కాక గోస్పాడు మండలంలో ఒక టీం, నంద్యాల రూరల్‌లో ఒక టీం, పట్టణంలోమూడు టీంలు మొబైల్‌గా పనిచేస్తాయి. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక బుధవారం ఉదయం ప్రారంభం కానుండగా, ఇప్పటికే పోలింగ్ సామగ్రిని, ఇవియంలు, వివిప్యాడ్‌లను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో తరలించారు.
అందరికీ గృహాల పథకంలో నేతల సిఫారస్సులకే పట్టం!
ఆదోనిటౌన్, ఆగస్టు 22: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద గృహాల మంజూరులో నేతలు చేసిన సిఫారస్సులను, వారు పంపిన దరఖాస్తులనే అధికారులు తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి తక్కువగా దరఖాస్తులు రావడంతో కొత్తగా మరలా దరఖాస్థులు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత 15 రోజుల నుంచి దరఖాస్తు స్వీకరణ నిర్వహించారు. అ యితే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీల నాయకులు, కౌన్సిలర్లు సిఫారస్సులు చేసిన దరఖాస్తులు తీసుకుంటున్నారని, తమవి ఎందుకు తీసుకోవడంలేదని సోమవారం లబ్ధిదారులు మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. నేతలు పంపిణిన దరఖాస్థూల మూటలను తీసుకుంటున్నారే తప్పా సామాన్యు ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు తీసుకోరని ఎఐవైఎఫ్ నాయకులు రాజు, సిపిఐ నాయకులు సుదర్శనలు ప్రశ్నించారు. తాము అడిగితే సమయం అయిపోయిందని చెబుతున్నారని అదే కౌన్సిలర్లు, అధికార పార్టీల నాయకులు చెబితే వారి దరఖాస్తూల మూటలను తీసుకోవడం విచారకరమన్నారు. అలాగే అంతేకాకుండా కార్యాలయంలోపని చేసే సిబ్బంది సైతంపై అధికారుల చర్యలను తప్పుపట్టారు. ఆదోనికి అందరికీ గృహ పథ కం కింద సుమారు 10వేల గృహాల సముయాదాలు మంజూరు చేశారు. అయితే దరఖాస్తుకోసం గత ఏడాదిన్నర క్రితం సుమారు 9వేల 740 మంది దరఖాస్తూ చేసుకోగా అందు లో అధికారులు ఇంటింటికి విచారణ చేపట్టి సుమారు 5వేల 400 మంది అర్హులని గుర్తించారు. ఇందులో మొద టి విడుతగా 4వేల 704 ఇండ్లు మం జూరు కాగా ఇందులో కేవలం 2వేల 500 మంది ఇంటి నిర్మాణానికి ముం దుకు వచ్చారు. అయితే మిగిలిన 2వేల మందికి కోసం మున్సిపల్ అధికారులు నేరుగా దరఖాస్తులు ఇవ్వాలని ప్రకటించారు. దీంతో అర్హత ఉన్న చాలా మంది దరఖాస్తూలు తీసుకొని ప్రతి రోజు మున్సిపల్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే నేతలు ఆయా వార్డుల వారిగా తమ వారిని గుర్తించి పంపిన సంచుల కొద్ది దరఖాస్తూలను అధికారులు తీసుకొని ఇక సమయం అయిపోయిందని తమ లక్ష్యం పూర్తి అయిందని దరఖాస్తులు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దరఖాస్తూలు తీసుకునే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.