కర్నూల్

సహకార సంఘం ఎన్నిక ప్రక్రియ సక్రమంగా జరుగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 21: కొలిమిగుండ్ల సహకార సంఘం ఎన్నిక ప్రక్రియ సక్రమంగా జరుగలేదని ఎమ్మెల్యే బిసి జనార్థన్‌రెడ్డి అన్నారు. సహకారం సంఘం ఎన్నిక జరుగడానికి గంట ముందు ఆయన సహకార సంఘం కార్యాలయ భవనంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఇద్దరు అధికారులు, కొందరు డైరెక్టర్లు కుమ్మక్కై ఎన్నికలు సక్రమంగా నిర్వహించకుండా, విధి విధానాలు రూపొందించకుండా, ఇష్టానుసారంగా తెల్లపేపర్ల మీద రాసుకొని కొంతమంది డైరెక్టర్లతో సంతకాలు చేయించుకున్నారని, ఈ విషయంపై ఇక్కడ పనిచేసే అధికారులతో రాత పూర్వకంగా సమాచారం సేకరిస్తున్నానని, అనంతరం ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన అక్రమాలపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అద్యక్షులు ఎం.రామేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, విఆర్ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు నరసింహస్వామి ఆలయంలో స్వాతిపూజలు
బనగానపల్లె, సెప్టంబర్ 21:పట్టణంలోని రవ్వలకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ నెల 23వ తేదీ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పావన నరసింహమూర్తి గురువారం తెలిపారు. ఈసారి కాకతాళీయంగా స్వాతి నక్షత్రం శనివారం రావడం విశేషంగా తెలిపారు. ఆ రోజున ప్రత్యేక పూజలు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 28వ తేదీ నాటికి లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు(మండలకాలం) అవుతున్నందున ఆరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కల్వర్టులో పడి వృద్ధురాలి మృతి
ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 21: మంచి నీటి కోసం వెళ్లి వృద్ధురాలు ప్రమదావశాత్తు కల్వర్టులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని పడిగెపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలు కుమార్తె నాగమ్మ ఇచ్చిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఉశేనమ్మ(80) మండలంలోని నర్సిపల్లె గ్రామానికి దస్తగిరి స్వామికి పూజలు చేసేందుకు బయలుదేరింది. మార్గ మధ్యలో దాహం వేయడంతో కల్వర్టు వద్ద వున్న నీటిని తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ...
ఆరుగురికి తీవ్ర గాయాలు
బండిఆత్మకూరు, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని ఎ.కోడూరు టర్నింగ్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఎల్లప్ప, జంబులయ్య, రత్నమ్మ, తులశమ్మ, హుసేనమ్మ, నాగసుబ్బమ్మలకు గాయాలు కాగా, హుసేనమ్మకు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు. ఓంకారం నుండి నంద్యాలకు ఆటో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో నుజ్జు నుజ్జ అయింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు 108కు సమాచారం అందించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డ్రైనేజీలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు
* విద్యార్థులు క్షేమం
సంజామల, సెప్టెంబర్ 21: సంజమాలలో గురువారం కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ విద్యార్థి బస్సు గ్రామంలోని పాత పోలీసు స్టేషన్ సమీపంలో డ్రైనేజీలోకి ఒరిగిపోయింది. ఈ బస్సు తిమ్మనాయినిపేట నుండి కోవెలకుంట్లకు 70 మంది విద్యార్థులను తీసుకొస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి క్రాస్ చేసే సమయంలో రోడ్డు కుంగిపోయి బస్సు కాల్వలోకి ఒరిగిపోవడంతో విద్యార్థులు గట్టిగా కేకలు వేస్తు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బస్సు డోరు తెరిచి విద్యార్థులను సుక్షితంగా బయటకు పంపారు. దీంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వాహనాల రాకపోకలకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో స్థానిక ఎస్‌ఐ విజయనాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీయించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు.