కర్నూల్

అంగన్‌వాడీ ఇంటర్వ్యూలకు కనీస సౌకర్యాలు కరవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 21: ఆదోని డివిజన్‌లోని ఆయా మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం అంగన్‌వాడీ కార్యకర్తల, ఆయాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.కర్నూలు అదనపు జెసి రామస్వామి, ఐసిడిఎస్ పిడి జూబేద బేగం, ఆర్డీఓ ఓబులేసు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. అయితే ఇంటర్వ్యూలకు హాజరైన వందలాది మహిళలకు వారితో వచ్చిన సహాయకులకు వారి చిన్నారులకు కనీస సౌకర్యాలు కరువవడంతో ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న చిన్నపాటి ప్రహారీపై, మైదానంలో కూర్చోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు వచ్చిన మహిళలు కూర్చోవడానికి కూర్చీలు లేకపోవడంతో కిందనే కూర్చోవాల్సి వచ్చింది. దీంతో కార్యాలయం బయట ఉన్న కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో తమ చిన్నారులను సేద తీర్చడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు మాత్రం నామమాత్రంగా ఒక షామియాన, కొన్ని కూర్చీలు మాత్రమే ఏర్పాటు చేశారని మహిళలు వాపోయారు. డివిజన్‌లోని ఆదోని రూరల్, అర్బన్‌లోని ఖాళీగా ఉన్న 7 అంగన్‌వాడీ కార్యకర్తలకు, 26 ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం ఆదోని డివిజన్‌లో 15 కార్యకర్తల పోస్టులకు, 80 ఆయాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అందుకుగాను సుమారు 200 మంది హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు శాంతిదుర్గా, సఫరున్సీబేగం, విజయ, రాధిక, కోటేశ్వరి పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం, సెప్టెంబర్ 21: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు గురువారం దేవస్థానం ప్రారంభంమయ్యాయి. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా దేవస్థానం వారు భక్తులను అలరించేందుకు పలు సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన బ్రామరి కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి బోయినపల్లి వారిచే గాత్రకచేరి, శ్రీనగర్ కాలనీ, హైదరాబాదు వారిచే కూచిపూడి నృత్యం, గ్రామోత్సవంలో ఎంతో వైభవంగా నిర్వహించేందుకు నాదస్వరం, కోలాటం, చెక్క భజన, డోలు విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, పుట్టబొమ్మలు తదితర ఏర్పాట్లను భక్తులు ఎంతో విశేషంగా భక్తుల కోసం దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు.
పురాన ప్రవచనం: దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ప్రఖ్యాత కవి పండితులు అయిన శివలంక ప్రకాశరావుచే దేవి భాగవతం ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రం ప్రతి రోజు సాయంత్రం బ్రామరి కళామందిరం వేదికపై 6 నుండి 8 గంటల వరకు ప్రవచన కార్యక్రమం ఉంటుంది. కావునా భక్తులందరు ప్రవచన కార్యక్రమాన్ని విని తరించాలని ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి
ఆదోనిటౌన్, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాషాభివృద్ధికి కృషి చేయాలని, తెలుగులోనే అన్ని అమలు అయ్యే విధంగా చేయాలని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కలం ప్రహ్లాద పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కిడ్డిస్ పాఠశాలలో అరసం ఆధ్వర్యంలో గురుజాడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుబాషాను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రభుత్వం తన భాషా విధానం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో గురుజాడ రచించిన రచనలను చదివి విద్యార్థులకు వినిపించారు. ఈకార్యక్రమంలో అరసం నాయకులు మల్లికార్జున, తెలుగు సాహితి వేదిక నాయకులు ఆంజనేయులు, ఆవుల బసప్ప, రామయ్య, ప్రమ్‌కుమార్, నాగన్న, హసీనాబీ, హసీన, నాగజ్యోతి, మోహన్‌రెడ్డి, ప్రకాష్, శరణబస్ప, రాజశేఖర్, దాసరి వెంకటేష్, కవులు పాల్గొన్నారు.