కర్నూల్

జగన్ అహంకారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 28 : ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ ఒక పెద్ద ఇగో మాస్టర్ అని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి విమర్శించారు. జగన్ పద్ధతి మార్చుకోకపోవటం వల్ల సలహాదారుడిగా చేరిన మైసురారెడ్డి సైతం గోళ్లు గిల్లుకుటూ ఉండలేమని భావించి వైకాపాను వదిలి టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రి టిజి.వెంకటేష్, పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.్ధనారెడ్డి, కెఇ ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ జగన్ ఢిల్లీ యాత్ర ఎవరి కోసమని, తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకే అంతుపట్టడం లేదని విమర్శించారు. సిఎం చంద్రబాబు ప్రతి ఏటా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు ప్రకటిస్తున్నారని, అయితే జగన్ ఎప్పుడైనా తన ఆస్తుల వివరాలను ప్రకటించారా అని ప్రశ్నించారు. తనపై పడిన నిందలను మాపుకోవడానికి ఢిల్లీ యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. అలాగే వైకాపా ఎమ్మెల్యేలను సిఎం చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి రుజువు చేయలేకపోయారని విమర్శించారు. భరోసా ఇవ్వలేకపోవటం వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌పై విశ్వాసం కోల్పోయారని, దీంతో వైకాపాని వీడి టిడిపిలో చేరుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు ప్రణాళికాబద్దంగా చేస్తున్న అభివృద్ధిని చూసి కూడా కొందరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఇక జగన్ పుణ్యమా అని పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం జైలు పాలయ్యారని విమర్శించారు. ఇకనైనా జగన్ ఇగోను వదిలి పెట్టి తన పార్టీ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చి నమ్మకం పెంచుకోవాలని హితవు పలికారు. జగన్ ఒక ముద్దాయి అని కేంద్ర మంత్రులు ఆయనకు ఎలా ఇంటర్వ్యూ ఇచ్చారని, ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతున్న వ్యక్తికి ఇంటర్వ్యూ ఇవ్వటం అందరికీ నిరాశ కలిగించిందన్నారు. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా చంద్రబాబును గాని పార్టీని గాని ఏమీ చేయలేరని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, ఆయన ఆశలు నెరవేరవని వెల్లడించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జగన్ అవినీతి కూపంలో కూరుకుపోయి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఢిల్లీలో ఏపి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా చిత్తుగా ఓడించినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. మాజీ మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తద్వారా దాదాపు 30వేల ఎకరాల్లో పరిశ్రమల హబ్ ఏర్పాటై లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధికి సహకరించాల్సింది పోయి విమర్శలు చేయటం మానుకోవాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సత్తా చాటి పార్టీపై నమ్మకం పెంచాలన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులు ఆకెపోగు ప్రభాకర్, పిపి.నాగిరెడ్డి, బిటి.నాయుడు, దేవేంద్రరెడ్డి, తిరుపాల్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.