కర్నూల్

కీళ్ళ మార్పిడిలో నూతన అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 12: మోకాలు, తుంటికీళ్ళ మార్పిడిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఈ తరహా శస్త్ర చికిత్సల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, గుంటూరు సాయిభాస్కర్ హాస్పటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. ఆదివారం కర్నూలు నగరంలోని మైక్యూర్ హాస్పెటల్‌లో కీళ్ళ మార్చిడి శస్త్ర చికిత్సలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమెరికాలో విడుదలైన వెంటనే మనదేశంలోకి ఇంప్లాంట్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యాధునిక ఇంప్లాంట్ ‘ఎటిన్యు’ విటమిన్ ఇతో రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఇంప్లాంట్ వాడకం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నిరోదించడంతోపాటు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల వరకు మన్నిక ఉంటుందన్నారు. ఇదే జాయింట్‌తో ఆదోనికి చెందిన రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులైన సరోజమ్మ(63), రుక్మిణి(75)లకు శస్తచ్రికిత్స ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద నిర్వహించామని తెలిపారు. ఇదే ఆపరేషన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్‌కు తానే నిర్వహించడంతో స్పందించిన మంత్రి గుటుంటూరు, విశాఖపట్టణ, కర్నూలు మెడికల్ కళాశాలకు జాయింట్ రీప్లెస్‌మెంట్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తరువాత కీళ్ళమార్పిడి తరహా శస్త్ర చికిత్సలకు హైదరాబాదు వెళ్ళాల్సిన పనిలేదని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్నా ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు. జాయింట్ రీప్లెస్‌మెంట్ హబ్‌గా గుంటూరు, విజయవాడ రూపాంతరం చెందాయని గుర్తు చేశారు. రోగలకు మరింత అవగాహన పెంచేందుకు కీళ్ళ మార్పిడిపై గుంటూరుతోపాటు విశాఖపట్టణం, కర్నూలు ప్రాంతాన్ని శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. సమావేశంలో హాస్పటల్ సిఇఓ డా.యరగూటి సాంబశివరెడ్డి, డా.నయిమ్‌ఆలీ పాల్గొన్నారు.
గంగపుత్రులు పిల్లలను విద్య వైపు మళ్లించాలి
* మంత్రి కొల్లు రవీంద్ర

మహానంది, నవంబర్ 12: గంగపుత్రులు తమ చిన్నారులను విద్యపట్ల మొగ్గు చూపడం లేదని, అందువల్ల వారు వెనుకబడి పోతున్నారని ప్రతి ఒక్కరు తమ చిన్నారులను విద్యవైపు మళ్లించి ఉన్నత విద్యను చదివించాలని, రాష్ట్ర న్యాయ శాఖ, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఆయన మహానంది క్షేత్రంలో గంగ పుత్రులు (బెస్త, తెలుగు) ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గంగపుత్రుల్లో అవగాహన వచ్చి అందరు సమైక్యతను చాటుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇలాగే ఐక్యత చాటుతూ తమ హక్కులను సాధించుకోవాలన్నారు. ఆదాయం ఎంత ఉన్నా మిగలడం మాతం సున్నానేనని, విద్య లేకపోవడంతో అవగాహన లేక వెనుకబడి పోతున్న కులం బెస్త కులం అన్నారు. సాంప్రదాయ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకుని తమ హక్కుల సాధనకు పోరాటం సాగించాలన్నారు. ఎపిలో నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. తమ చిన్నారులను చదివించేందుకు కృషి చేయాలన్నారు.
చదివితే తమకు మించిన తెలివిమంతులు ఏ కులంలో లేరన్నారు. కోస్తాలోని చిన్నగోల్లపాలెంలో ప్రతినిత్యం పడవలో వస్తూ విద్యన అభ్యసించి ముత్యాలరాజు అనే వ్యక్తి నేడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలన్నారు. తమ హక్కుల సాదనకై ఈ నెల 21న విజయవాడలో భారీ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్, సాయిజ్యోతి, లక్కబోయిన ప్రసాద్, గంగాదర్ పాల్గొన్నారు.