కర్నూల్

పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం:డిటిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 29: గత ఆర్థిక సంవత్సరం రవాణాశాఖ పన్ను వసూళ్లలో నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో వసూలు చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డిటిసి) మీరా ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది రవాణా శాఖ కమిషనర్ జిల్లాకు రూ. 116.84 కోట్లు వసూల్ చేయాలని నిర్ధేశించగా రూ. 133.86 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు. అలాగే 2016-17 సంవత్సరానికి గానూ రూ. 162.94 కోట్లు వసూలు చేయాలని నిర్ధేశించారన్నారు. త్రైమాసిక పన్ను కింద రూ. 49.48కోట్లు, జీవితకాలపు పన్ను రూ. 69.96కోట్లు, రుసుము రూ. 13.68కోట్లు, అపరాధ రుసుం రూ. 22.83 కోట్లు, సేవా పన్ను రూ. 6.99 కోట్లు వసూల్ చేసి నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు.