కర్నూల్

సంక్షేమ ఫలాలు ప్రజలకు చేర్చే బాధ్యత అధికారులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, డిసెంబర్ 7:రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించే బాధ్యత అధికారులదే అని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో గురువారం ఎంపీపీ సాలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పలు శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్‌షెడ్ అధికారి మాట్లాడుతూ 60 చెక్‌డ్యాంలకు గానూ 20 పూర్తిచేసినట్లు చెప్పగా ఎమ్మెల్యే పనుల వేగం పెంచాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ రూ. 810 చెల్లిస్తే ఎస్సీ, ఎస్టీలకు కోడిపిల్లలు పెంచుకునేందుకు ఇస్తారన్నారు. 160 ఎకరాల్లో గ్రాసం పెంచేందుకు రైతులు ఆమోదించినా చివరకు 60 ఎకరాల్లోనే సాగు చేశారన్నారు. వీటిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలందరికీ తెలియాలన్నారు. మైనర్ ఇరిగేషన్ పరిధిలో 140 పనులకు 80 పూర్తయ్యాయని, 24 చెక్‌డ్యాంలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ మండలంలోని 45 గ్రామాలకు గానూ 15 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎక్కుగా వేశారని, మిగతా గ్రామాల్లో కూడా రానున్న కాలంలో వేస్తామన్నారు. 8 అంగన్‌వాడీ భనాలకు గానూ 4 పూర్తయినట్లు తెలిపారు. బనగానపల్లె పట్టణంలో రూ. 10 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల ఏర్పాటుకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించారని, జిల్లాలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. ఆర్‌అండ్‌బి పరిధిలో పలు రోడ్ల ఏర్పాటుకు రూ. 12 కోట్లు మంజూరయ్యాయని వాటి పనులు జరుగుతున్నాయన్నారు. అవసరమైన పాఠశాలలకు 22 అదనపు గదులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. పొదుపు గ్రూపులు మండలంలో 1,786 వున్నాయని అందులో గ్రూపుల లీడర్లు మారకుండా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఎక్కువ ప్రయోజనాలు వారే పొందుతున్నారని, వెలుగు సిబ్బంది వీలైనంత త్వరలో పొదుపు సంఘాల లీడర్లను మార్చాలన్నారు. బనగానపల్లెకు 2,700 గృహాలు మంజూరు కాగా అందులో 1000 పూర్తికాగా 500 వివిధ దశల్లో వున్నాయన్నారు. దద్దనాల, చెరువుపల్లె చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ సదుపాయానికి ఆమోదం వచ్చిందని ఇది జరిగితే 20 గ్రామాలకు చెందిన వారు ప్రయోజనం పొందుతారన్నారు. నీరు-చెట్టు పథకం ఎంతో సద్వినియోగమైందని, దీనివల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయన్నారు. ఇప్పుడు 30నుంచి 40 అడుగుల లోతు వేస్తేనే బోర్లలో నీరుపడుతుందన్నారు. ప్రకృతి సహకరించడం అందుకు సీఎం చంద్రబాబు కృషి కూడా తోడై నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధి బాగా జరుగుతుందిన్నారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీడీఓ పి.బాలకృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివలింగారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు బషీర్‌అహ్మద్, జడ్పీటీసీ సభ్యులు రాజగోపాల్, తహశీల్దార్ నూకరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ కోడి నాగరాజుయాదవ్, కాట్రెడ్డి రాజశేఖరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయం
* రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, డిసెంబర్ 7:రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తన్నారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. నగరంలోని రోజావీధి, కొత్తపేట ప్రాంతాల్లో శిక్షణ పొందిన మహిళలకు గురువారం కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్న దానికి ఇటువంటి కార్యక్రమాలే నిదర్శనం అన్నారు. అలాగే ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు అందించే విధానంలో ప్రభుత్వం ముందుకు పోతుందని, ప్రతిఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి, మెప్మా పీడీ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు చిత్రకారుడికి జాతీయ అవార్డు
నందికొట్కూరు, డిసెంబర్ 7:వాతావరణ కాలుష్యం, నీటి సంరక్షణ అంశాలపై నందికొట్కూరు చిత్రకారుడు దేశెట్టి చిత్రించిన చిత్రాలు జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు గురువారం ఆయన తెలిపారు. నంద్యాల కోటేష్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తాను చిత్రించిన వాటిలో వాతావరణ కాలుష్యం చిత్రం స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైందని నిర్వాహకుడు కోటేష్ తెలిపాడన్నారు. పట్టణంలో తాను వంద మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చానని, వారు జాతీయస్థాయి పోటీలకు పంపిన చిత్రాలకు సంబంధించి 12మందికి గోల్డ్‌మెడల్స్ వచ్చాయన్నారు. దీంతో తనకు విశిష్ట ఆచార్య అవార్డు వచ్చిందన్నారు. ఈ నెల 10వ తేదీ నంద్యాలలోని కోదండ రామాలయంలో ఈ అవార్డులు అందుకోనున్నట్లు తెలిపారు.